Moviesబాల‌య్య‌తో హ‌రీష్‌శంక‌ర్‌ను కొట్టిస్తానంటోన్న టాలీవుడ్ హీరో... ఇదేం ట్విస్ట్‌..!

బాల‌య్య‌తో హ‌రీష్‌శంక‌ర్‌ను కొట్టిస్తానంటోన్న టాలీవుడ్ హీరో… ఇదేం ట్విస్ట్‌..!

టాలీవుడ్లో ద‌గ్గుబాటి హీరో రానా చాలా స‌ర‌దాగా ఉంటాడు. త‌న తోటి హీరోల‌ను ఆట‌ప‌ట్టిస్తాడు.. వారిమీద స‌ర‌దాగా జోకులు వేస్తాడు… రానా ఎక్క‌డ ఉంటే అక్క‌డ మంచి హెల్దీ వాతావ‌ర‌ణం ఉంటుంద‌ని ఇండ‌స్ట్రీ జ‌నాలు చెపుతుంటారు. సోష‌ల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటాడు. తాజాగా రానా వేరే వాళ్ల ట్వీట్ కింద వేసిన కామెంట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఆహాలో కొద్ది రోజుల క్రితం ఓ షో జ‌రిగింది. ఈ టాక్ షోలో హోస్ట్ బాల‌య్య‌తో పాటు శ్రీయ‌, సుహాసినితో పాటు ద‌ర్శ‌కుడు హరీష్ శంక‌ర్ కూడా పాల్గొన్నారు. ఈ షోకు సంబంధించిన ప్రోమోక‌ట్‌ల‌ను ఆహా వ‌దులుతూనే వ‌స్తోంది. తాజా ప్రోమోలో భార్య‌కు భ‌ర్త ఐల‌వ్ యూ చెప్పాల‌న్న‌ది కాన్సెఫ్ట్‌. దానికి హ‌రీష్ ఏదో చెప్ప‌బోతుంటే బాల‌య్య నాతో నా భార్య వ‌సుంధ‌ర‌కు ఐల‌వ్ యూ చెప్పించిన నా ఎల్డ‌ర్ బ్ర‌ద‌ర్ రానా ద‌గ్గుబాటి అన్నారు.. వెంట‌నే హ‌రీష్ రానా చేసిన ఆ రిస్క్‌కు మీరు రానాను రెండు పీకినా పీకొచ్చు అన్నాడు.

ఆహా ట్విట్ట‌ర్‌లో ఆ ప్రోమో పోస్ట్ చేసింది. దానికి రానా షాకింగ్ రిప్లే ఇచ్చాడు. అన్నందుకు నిన్ను పీకాల్సింద‌ని కామెంట్ చేశాడు. అంటే బాల‌య్య హ‌రీష్ శంక‌ర్ ను కొడితే బాగుండునన్న కోణంలో రానా కామెంట్ స‌ర‌దాగా ఉంది. దీంతో సోష‌ల్ మీడియాలో రానా కామెంట్‌కు స‌పోర్ట్‌గా ప‌లువురు కామెంట్లు, ఎమోజీల‌తో హోరెత్తిస్తున్నారు. ఇక షోలో బాల‌య్య హ‌రీష్‌పై చాలా పంచ్‌లు వేసిన‌ట్టుగా కూడా తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news