Newsఐశ్వర్యరాయ్‌ని అన్ని ముద్దులు పెట్టుకున్న ఒకే ఒక్క హీరో అతడే... ఎంత...

ఐశ్వర్యరాయ్‌ని అన్ని ముద్దులు పెట్టుకున్న ఒకే ఒక్క హీరో అతడే… ఎంత ల‌క్కీ ఫెలోనో…!

బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంటికి కోడలైన మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ని ఒక హీరో ఎన్ని ముద్దులు పెట్టుకున్నాడో ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. ఇండియన్ జేంస్ కెమరూన్ అనే పేరున్న దర్శకుడు శంకర్ షన్ముగం. ఆయన తీసిన ప్రతీ సినిమా ఓ సంచలనం. కాంబినేషన్ ఎప్పుడూ హాట్ టాపిక్. రజినీకాంత్-ఐశ్వర్య రాయ్ కాంబో అంటే నిజంగా అందరూ షాకయ్యారు.

అలాగే, అప్పట్లో తొలిముద్దు హీరో ప్రశాంత్-ఐశ్వర్య రాయ్ కాంబోకి షాకయ్యారు. శంకర్-ప్రశాంత్-ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా జీన్స్. ఈ సినిమాతో శంకర్ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. ఇది ఐశ్వర్య కి మూడవ సినిమా. ఏ ఆర్ రెహమాన్ సంగితం అందించిన ఈ సినిమా మ్యూజికల్ గా కూడా భారీ హిట్ ని సొంతం చేసుకుంది.

శంకర్ ఏ సినిమా చేసినా ఆయన మార్క్ టెక్నాలజీతో పాటు సామాజిక అంశాన్ని చొప్పిస్తాడు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య (కవలల) ఉండే అనుబంధం వారి భార్యల వల్ల ఎలా తలకిందులైంది..అదే తన కవల పిల్లలలో తిరిగి జరుగితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి.. వాటిని ఎలా అధిగమించాలి అనే పాయింట్ తో తెరకెక్కించాడు. అయితే, ఇక్కడ ఇద్దరు కవలలు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. అదే కథలో కాంఫ్లిక్ట్. హీరో డ్యూయల్ రోల్ లో నటిస్తే ఐశ్వర్య రాయ్ ఒకే అమ్మాయి ఇద్దరుగా నటించి ఆకట్టుకుంది.

ఈ సినిమాలో ఉన్న హాయ్ ర హాయ్ రా హాయ్ రబ్బా పాటలో ప్రశాంత్ హీరోయిన్ ని తెగ ముద్దులు పెట్టుకుంటాడు. అప్పటికే, సల్మాన్ ఖాన్ తో రిలేషన్ లో ఉంది ఐశ్వర్య. దాంతో ఇద్దరి మధ్య చిన్న కోల్డ్ వార్ కూడా జరిగిందట. రొమాంటిక్ సీన్స్, ముద్దులు పెట్టుకోవడానికి వీల్లేదని ఐష్‌కు సల్మాన్ వారింగ్ ఇచ్చాడట. ఇలాంటి కారణాల వల్ల ఆ తరువాత కాలంలో ఇద్దరూ విడిపోయారు కూడా. అయితే, దర్శకుడు శంకర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కోసమే ఆ పాటలో ముద్దులు పెట్టించాడని అనుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news