Newsఎలిమినేట్ అయితే అయ్యింది.. బంపర్ ఆఫర్ కొట్టేసిన శోభా శెట్టి.. 100...

ఎలిమినేట్ అయితే అయ్యింది.. బంపర్ ఆఫర్ కొట్టేసిన శోభా శెట్టి.. 100 బిగ్ బాస్ ట్రోఫీలకు సమానం..!

శోభ శెట్టి .. కార్తీకదీపం సీరియల్ లో విలన్ గా పాత్ర పోషించి అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గానే బిగ్ బాస్ సీజన్ సెవెన్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అవ్వకముందు నుంచే ఈ సీజన్ లో కచ్చితంగా శోభ శెట్టి ఉంటుంది అంటూ పలువురు ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేశారు . అంతేకాదు అమ్మడు ట్రోఫీ గెలవక పోయిన టాప్ ఫైవ్ లో కచ్చితంగా ఉంటుంది అంటూ ఎక్స్పెక్ట్ చేశారు.

కానీ అభిమానులు ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదు. టాప్ ఫైవ్ కి ఒక్క అడుగు దూరం నుండే వెనక్కి వచ్చేసింది. 14వ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా శోభ శెట్టి హౌస్ నుంచి ఎలిమినేట్ బయటకు వచ్చేసింది . ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజి పైకి వచ్చి ఏడ్చిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . నిజానికి సోభాశెట్టి హౌస్ లో గేమ్ ఆడింది అనడం కన్నా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అనడం కన్నా టిఆర్పి రేటింగ్స్ బాగా పెంచడానికి ట్రై చేసిందని చెప్పాలి .

అనవసర విషయాలలో తల దూర్చడం కచ్చితంగా ఆ వారం ఆ ఎలిమినేట్ అవ్వకుండా ఉండేలా నలుగురితో మంచిగా ఉంటూ ఎవరైతే తనకు యాంటీగా ఉన్నారో వాళ్లను టార్గెట్ చేయడం అలాంటి పనులు బాగానే చేసింది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . కాగా రీసెంట్గా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటికి వచ్చిన శోభా శెట్టిని చూసి ఫాన్స్ కుమిలిపోతున్నారు . టాప్ ఫైవ్ లో ఉండాల్సింది అక్క అంటూ ఎమోషనల్ కామెంట్స్ పెడుతున్నారు .

అయితే శోభ శెట్టి హౌస్ నుంచి ఎలిమినేట్ అయినా సరే మంచి బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది . చిరంజీవి సినిమాలో ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందట . ఈ సినిమాలో లేడీ విలన్ పాత్ర కోసం ఆమెను సెలెక్ట్ చేసుకున్నాడు వశిష్ట అంటూ ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు శోభ శెట్టి ఫ్యాన్స్ కూడా చిరంజీవి సినిమా అంటే 100 బిగ్ బాస్ ట్రోఫీలతో సమానం .. డోంట్ వర్రీ అంటూ సముదాయిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news