Newsర‌వితేజ - వెంక‌టేష్ మ‌ల్టీస్టార‌ర్‌... డైరెక్ట‌ర్ - నిర్మాత ఎవ‌రంటే...!

ర‌వితేజ – వెంక‌టేష్ మ‌ల్టీస్టార‌ర్‌… డైరెక్ట‌ర్ – నిర్మాత ఎవ‌రంటే…!

టాలీవుడ్ లో ఉన్న హీరోలలో ఎక్కువ మల్టీ స్టార్ సినిమాలు చేసిన ఘనత సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కే దక్కుతుంది. అసలు ఈ తరం జనరేషన్ స్టార్ హీరోలలో కలిసి మల్టీస్టార‌ర్‌ సినిమాలు చేసి హిట్లు కొట్టిన ఘనత కచ్చితంగా వెంకటేష్‌దే. పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల – మహేష్ బాబు తో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు – వరుణ్ తేజ్ తో ఎఫ్2 – ఎఫ్ 3, రామ్‌తో మసాలా.. చివరకు చింతకాయల రవి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక సాంగ్లో స్టెప్పులు కూడా వేశాడు వెంకీ.

అలాగే నాగచైతన్యతో కలిసి వెంకీ మామ సినిమా కూడా చేశాడు. ప్రేమమ్ సినిమాలోనూ నటించాడు. ఇలా పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి హీరోతో అయినా స్క్రీన్ షేర్ చేసుకునేందుకు వెంకటేష్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. తాజాగా వెంకటేష్ మరో అదిరిపోయే మల్టీస్టారర్ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మాస్ మహారాజ్ రవితేజ – వెంకటేష్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.

ఈ ఏడాది రవితేజ – చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ అయింది. రవితేజ మైత్రి మూవీ బ్యానర్ లో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇప్పుడు రవితేజ బిజీ షెడ్యూల్ లో ఉండడంతో ఆ సినిమా కొంతకాలంగా హోల్డ్ లో పెట్టారు. దానికి బదులుగా రవితేజతో మైత్రి వాళ్ళు చేయాల్సిన సినిమాను ఇప్పుడు వెంకటేష్ – రవితేజ కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమా డైరెక్టర్ ఎవరు అన్నది ? ప్రస్తుతానికి క్లారిటీ రాకపోయినా.. టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న కుర్ర క్రేజీ డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు అని తెలుస్తోంది. వెంకటేష్ – రవితేజ కాంబినేషన్ అంటే టాలీవుడ్లో కచ్చితంగా అది సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవుతుంది అనటంలో సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news