Movies"ప్రభాస్ ఓ మహానటుడు..కెమారా ముందు అలా..కెమారా వెనుక అలా ఉంటాడు".. స్టార్...

“ప్రభాస్ ఓ మహానటుడు..కెమారా ముందు అలా..కెమారా వెనుక అలా ఉంటాడు”.. స్టార్ హీరో కూతురు కామెంట్స్ వైరల్..!!

ప్రభాస్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . బాహుబలి తర్వాత అంతటి స్థాయి హిట్ అందుకున్న ప్రభాస్ కి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి . రీసెంట్గా సలార్ సినిమాలో నటించిన ప్రభాస్ త్వరలోనే కల్కి సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. సినిమాలో ఆయనకు జోడిగా నటించిన హీరోయిన్ శృతిహాసన్ ఆయనపై సరదాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తున్నాయి .

“ప్రభాస్ అంటే చాలా మంచోడు అని చెప్పుకొచ్చిన శృతిహాసన్ కెమెరా ముందు ఒకలా కెమెరా వెనక ఒకలా నటిస్తాడు అంటూ చెప్పుకొచ్చింది. అప్పటివరకు మా అందరితో సరదాగా ఉంటాడు ..జోవియల్ గా మాట్లాడుతాడు వన్స్ షాట్ రెడీ టేక్ అనగానే చాలు పూనకాలు వచ్చినట్లు వేరే మనిషి లోపలికి ప్రవేశించినట్లు ఇరగదీసేస్తాడు.. అసలు అలా ఎలా చేయగలరు ..నాకు అర్థం కాదు “..

“అప్పటికే సరదాగా ఉన్న ప్రభాస్ వెంటనే ఎమోషనల్ సీన్ కి కనెక్ట్ అయిపోతాడు .. వెంటనే వైలెన్స్ సీన్స్ చేసేస్తాడు .. ఫైట్ సీన్స్ లో నటిస్తాడు .. కెమెరా ముందు ఒకలా ఉండడం కెమెరా వెనక ఒకలా ఉండడం ప్రభాస్ కి బాగా అలవాటైపోయింది” అంటూ చెప్పుకొచ్చింది . ఆమె ఈ కామెంట్స్ పాజిటివ్ గా చేసిన కొంతమంది యాంటీ రెబెల్ ఫ్యాన్స్ వ్యంగంగా కౌంటర్ లు వేస్తున్నారు . దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news