Newsఇక ఆ నిర్మాత‌ల‌తో సినిమాలు చేయ‌ను... నాని షాకింగ్ డెసిష‌న్‌కు ఆ...

ఇక ఆ నిర్మాత‌ల‌తో సినిమాలు చేయ‌ను… నాని షాకింగ్ డెసిష‌న్‌కు ఆ గొడవే కార‌ణ‌మా…!

నేచురల్ స్టార్ నాని తాజాగా హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి మెప్పించారు. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇది ఇలా ఉంటే నాని ఎక్కువగా కొత్త దర్శకులకు, కొత్త నిర్మాతలకు సినిమాలు చేస్తూ వస్తున్నారు. అప్పుడప్పుడు పాత నిర్మాతలు, సీనియర్ ద‌ర్శ‌కుల‌తోనూ సినిమాలు చేస్తున్నారు. అయితే హాయ్ నాన్న సినిమా విషయంలో తలెత్తిన గొడవ వల్ల.. ఇకపై కొత్త నిర్మాతలకు అంత త్వరగా సినిమాలు చేయకూడదని స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

హాయ్ నాన్న సినిమాను నిర్మాత సివిఎంకు చేశారు. ఇందులో విజయేంద్ర రెడ్డి కూడా నిర్మాణ భాగస్వామి. సినిమా ప్రారంభంలో భాగస్వామిగా ఉంటారనుకున్న మూడో వ్యక్తి తప్పుకున్నారు. దీంతో మిగిలిన ఇద్దరు కలిసి సినిమాను బాగా పూర్తి చేశారు. ఖర్చు భారీగా పెట్టారు. కానీ ఎక్కడో తేడా వచ్చిందట. సినిమా మార్కెటింగ్ సరిగ్గా చేసుకోలేకపోయారు. దీంతో భాగస్వాములు విడిపోతున్నారని వార్తలు కూడా వచ్చాయి.

ఇలాంటి టైంలో నాని స్వయంగా రంగంలోకి దిగి తనే బాధ్యత తీసుకొని ఆంధ్ర, సీడెడ్, ఓవర్సీస్‌ల‌లో విడుదల చేయాల్సి వచ్చింది. ఈ టెన్షన్లు అన్ని తాను, తన మేనేజర్ వెంకట్ కలిసి చూసుకోవాల్సి వచ్చిందట. దీంతో సినిమా రిలీజ్‌కి ముందు అటు ప్రమోషన్లపై సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేక, ఇటు టెన్షన్ పడుతూ ఉండాల్సి వచ్చిందట. అందుకే ఇకపై కొత్త నిర్మాతలకు సినిమా చేయటానికి కాస్త గ్యాప్ ఇవ్వాలని నాని బలంగా నిర్ణయం తీసుకున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news