Movies' డెవిల్ ' ప్రి రిలీజ్ బిజినెస్ క‌ళ్యాణ్‌రామ్ కెరీర్ ఆల్...

‘ డెవిల్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్ క‌ళ్యాణ్‌రామ్ కెరీర్ ఆల్ టైం బిగ్ టార్గెట్‌…!

నందమూరి కుటుంబం నుంచి హీరోగా పరిచయం అయిన నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో తన కెరీర్ లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. బింబిసార కళ్యాణ్ రామ్ కెరీర్ లో తొలి రూ.50 కోట్ల సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. అయితే ఈ ఏడాది అమీగోస్‌ సినిమాతో నిరాశపరిచాడు. ఈ ఏడాదికి ముగింపు ఇస్తూ డెవిల్ సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అభిషేక్ నామ నిర్మాణం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది.

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా కనిపించబోతున్నాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. అజయ్, సత్యా తదితరులు కీలక పాత్రలలో నటించారు. డెవిల్ బ్రిటిష్ కాలం నాటి కథతో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాలో ఓ హత్య జరగటం దానిని చేదించేందుకు సీక్రెట్ ఏజెంట్ ఇంటర్ అవ్వడం.. ఆ తర్వాత ఏం జరిగింది అన్న నేపథ్యంలో ఇది తెరకెక్కింది.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో డెవిల్ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం నైజాంలో రూ.5.50 కోట్లు సీడెడ్ లో, రూ.3 కోట్లు ఆంధ్రాలో.. మిగిలిన ప్రాంతాలలో రూ.8 కోట్లకు బిజినెస్ జరిగింది. నైజంలో డెవిల్ సినిమా హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తంగా రూ.16.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకు జరిగింది.

ఇక ఓవర్సీస్ లో ఈ సినిమాకు రెండు కోట్లు.. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.1.60 కోట్లు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 20 కోట్ల వ‌ర‌కు బిజినెస్ జరిగింది. ఈ సినిమా రూ.21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతుంది. ఇంత మొత్తం వసూలు చేస్తేనే డెవిల్ సినిమా హిట్ అయినట్టు లెక్క. కళ్యాణ్ రామ్‌కు ఇది డీసెంట్ టార్గెట్ అని చెప్పాలి. బింబిసార రేంజ్ లో ఈ సినిమాకు టాక్‌ వస్తే ఈ టార్గెట్ మంచినీళ్లు తాగినంత సులువుగా కళ్యాణ్ రామ్ కొట్టేస్తాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news