News"అప్పుడు నీహారిక..ఇప్పుడు నివృత్తి".. మళ్ళీ అదే తప్పు..మెగా ఫ్యాన్స్ కడుపు రగిలిపోతుందిగా..!?

“అప్పుడు నీహారిక..ఇప్పుడు నివృత్తి”.. మళ్ళీ అదే తప్పు..మెగా ఫ్యాన్స్ కడుపు రగిలిపోతుందిగా..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా మెగా డాటర్ కి సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా శ్రీజ నిహారిక విడాకులు తీసుకున్నప్పటినుంచి మెగా హీరోల కన్నా మెగా డాటర్ల విషయాలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఇండస్ట్రీలో మరో న్యూస్ హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు హీరోయిన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నిహారిక ఒక్కటే.

అయితే ఆమె కూడా సక్సెస్ కాలేకపోయింది. అయినా సరే రిస్క్ చేసి మరి మరో మెగా హీరోయిన్ ఇండస్ట్రీలోకి రాబోతున్నట్లు తెలుస్తుంది . దానికి చిరంజీవి కూడా సపోర్ట్ చేశాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఆమె మరి ఎవరో కాదు చిరంజీవి మనవరాలు నివృతి. ఎస్ చిరంజీవి కూతురు శ్రీజ పెద్ద కూతురు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుందట . అంతేకాదు పలు సినిమాలలో క్యారెక్టర్స్ కోసం కూడా ట్రై చేస్తుందట .

కానీ చిరంజీవి చదువు అయిపోయాక ఇండస్ట్రీలోకి రా అంటూ చెప్పినా.. ఓ పక్క చదువు మరోపక్క యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందట. అంతేకాదు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో చాన్స్ ఇవ్వమంటూ బలవంతం చేస్తుందట. దీంతో మనవరాలు కోరికకు నో చెప్పలేక చిరంజీవి సైతం ఆమెను తన సినిమాలో పెట్టుకోవడానికి ఓకే చేసినట్లు తెలుస్తుంది. దీంతో నిహారికకు గట్టి కాంపిటీషన్ ఇవ్వబోతుంది ఈ నివృతి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి . చూద్దాం మరి దీనిపై మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news