Newsవావ్: ఇండస్ట్రీలో శ్రీలీల అమెజింగ్ రికార్డ్.. ఇప్పటి వరకు ఏ హీరోయిన్...

వావ్: ఇండస్ట్రీలో శ్రీలీల అమెజింగ్ రికార్డ్.. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ దక్కించుకోలేనిది..!!

శ్రీ లీల ..ఈ పేరు చెప్తే కుర్రాళ్లకు ఎక్కడ తెలియని ఊపు వచ్చేస్తుంది . తెలియకుండానే ఓ రకమైన ఫీలింగ్ కలిగిపోతుంది . అలాంటి క్రేజీ స్థానాన్ని అందుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేస్తున్న శ్రీలీల చేతిలో ప్రెసెంట్ 10 సినిమాలకు పైగానే ఉన్నాయి.

కాగా రీసెంట్గా నటించిన ఆది కేశవ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ అందుకుంది . ఇలాంటి క్రమంలోనే శ్రీలీలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. శ్రీలీల నితిన్ ఎక్స్ ట్రా అర్డినరీ సినిమాలో ఓ మాస్ మసాల సాంగ్ చేయబోతుందట. అంతేకాదు ఈ సాంగ్ కోసం శ్రీ లీలా బాగా కష్టపడుతుందట .

శంషాబాద్ లో స్పెషల్గా నిర్మించిన సెట్లో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతుందట . ఈ పాట కోసం దాదాపు 300 మందికి పైగా ఫిమేల్ డాన్సర్లు స్టెప్పులెస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా ఇలా 300 మంది ఫిమేల్ డాన్సర్లతో ఆడి పాడి చిందేసింది లేదు . ఆ ఘనత అందుకున్న హీరోయిన్గా శ్రీలీల రికార్డులు క్రియేట్ చేయబోతుంది . ఈ సాంగ్ను డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయబోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news