Movies"ప్రజెంట్ జనరేషన్ కి అదే కావాలి".. సింగర్ సునీత సెన్సేషనల్ కామెంట్స్...

“ప్రజెంట్ జనరేషన్ కి అదే కావాలి”.. సింగర్ సునీత సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

ఈ మధ్యకాలంలో స్టార్ సింగ ర్ సునీత గురించి సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఆమె రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆమెకు సంబంధించిన వార్తలను తెలుసుకోవడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాగా 15 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ సపరేట్ గుర్తింపు సంపాదించుకున్న సునీత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 28 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ క్రమంలోనే ఆమె రొటీన్ కి భిన్నంగా కాస్త ఇంట్రెస్టింగ్ విషయాలను మీడియాతో షేర్ చేసుకున్నారు .

ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ ..”రీసెంట్ కాలంలో ప్రేమ పెళ్లి అనేది చాలా సిల్లీగా మారిపోయింది. ఎక్కువగా బ్రేకప్ లు అవుతున్నాయి . లవ్ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు నేటి జనరేషన్ . శారీరకంగా మానసికంగా ఇబ్బందులు ఉంటే తప్పదు బ్రేకప్ చెప్పుకోవడం మంచిదే .. కానీ చిన్న చిన్న విషయాలకే బ్రేకప్ చెప్పుకోవడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది . లవ్ చేస్తే ఒక పార్టీ .. లవ్ బ్రేకప్ చెప్పేసుకుంటే ఒక పార్టీ .. కొత్త లవర్ దొరికితే మరో పార్టీ ఇలా ఇచ్చుకుంటూ రిలేషన్స్ నిచాలా ఈజీగా బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు”.. అంటూ సునీత కామెంట్ చేశారు.

అంతేకాదు డ్రెస్సింగ్ విషయంలో కూడా ప్రస్తావిస్తూ..” డ్రెస్సింగ్ ను బట్టి అవతల వ్యక్తి మంచివారా..? చెడ్డవారా..? అని ఎలా చెక్ చేయగలం చెప్పండి అంటూ స్ట్రైట్ గా ప్రశ్నించారు . అలవాట్లు చెడ్డవి అయినంత మాత్రాన ఆ మనిషి చెడ్డవాడా..? అని మనం డిసైడ్ చేయలేం . అందుకే డ్రెస్సింగ్ సెన్స్ బట్టి క్యారెక్టర్ ని తప్పుగా చూడకూడదు అంటూ తన మనసులోని మాటను నిర్భయంగా చెప్పేసింది సునీత . పలువురు అమ్మాయిలు కూడా సునీత మాటలకు అట్రాక్ట్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news