Newsశ్రీయ చేసిన ప‌నికి ఆమె నిజంగానే బంగారం అనాలి... ఎంత గొప్ప...

శ్రీయ చేసిన ప‌నికి ఆమె నిజంగానే బంగారం అనాలి… ఎంత గొప్ప మ‌న‌స్సో…!

ఇష్టం సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది శ్రీయ శరణ్. ఈ సినిమా హిట్ అవకపోయినప్పటికీ ఆ తర్వాత నాగార్జున నటించిన సంతోషం సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకుంది. దాంతో తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించే అవకాశం అందుకుంది. శ్రియ ఖాతాలో మంచి బ్లాక్ బస్టర్ ఉన్నాయి. లక్కీ హీరోయిన్‌గా శ్రియని చెప్పుకుంటారు.

తెలుగులో మాత్రమే కాదు, తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూడా నటించింది. కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ శ్రియకి మంచి క్రేజ్ ఏర్పడింది. రాజమౌళి లాంటి అగ్ర దర్శకులతో కూడా ఈ బ్యూటీ పనిచేసే అవకాశం అందుకుంది. ఇక బాలీవుడ్ లో ఆవారాపన్ సినిమా చేసి అక్కడ కూడా సక్సెస్ చూసింది. చెప్పాలంటే శ్రియ ట్రాక్ రికార్డ్ సూపర్ గా ఉంటుంది.

అయితే, సక్సెస్ లో ఉన్న ఏ హీరోయిన్ ని ఒకసారి సైన్ చేసిన సినిమా నుంచి తప్పించరు. అందులో శ్రియ లాంటి మంచి అమ్మాయిని తప్పించాలంటే యూనిట్ సభ్యులు గానీ, హీరో గానీ ఒప్పుకోరు. కానీ, మంచు హీరో వల్ల శ్రియ ఒక సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. ఈ విషయం ఓ ఇంటర్వ్యూలో స్వయంగా నిర్మాతే చెప్పడం విశేషం. ఆ సినిమా మిస్టర్ నూకయ్య.

మంచి మనోజ్ హీరోగా నటించాడు. ఈ సినిమా ఫ్లాపైంది. వాస్తవానికి ముందు మిస్టర్ నూకయ్య సినిమాలో హీరోయిన్‌గా శ్రియని ఫిక్స్ చేసుకొని 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారట. 10 రోజులు షూటింగ్ కూడా జరిగిందట. సడన్‌గా ఏం జరిగిందో గానీ మంచి మనోజ్ నిర్మాతతో వద్దని చెప్పడంతో కొత్త అమ్మాయిని తీసుకొని శ్రియని వద్దని చెప్పారట. సాధారణంగా అలా ప్రాజెక్ట్ మధ్యలో నుంచి తీసేస్తే ఏ హీరోయిన్ అయినా తీసుకున్న అడ్వాన్స్ ఒక్క పైసా కూడా తిరిగివ్వదు.

కానీ, శ్రీయ 5 లక్షలు నిర్మాతకి నేరుగా పంపించేసుందట. 10 రోజులు షూటింగ్ కి వచ్చా కాబట్టి 5 లక్షలు రిటర్న్ చేయడం లేదు. ఫ్యూచర్ లో కావాలంటే ఒక స్పెషల్ సాంగ్ చేసి పెడతా అని నిర్మాతకి చెప్పిందట. అందుకే ఆ చిత్ర నిర్మాత శ్రియ మంచి అమ్మాయి అని చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news