News' వార్ 2 ' లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇప్పుడు... షూటింగ్...

‘ వార్ 2 ‘ లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇప్పుడు… షూటింగ్ ఎక్క‌డో తెలుసా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కి జోడిగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న దేవర సినిమా రెండు పార్టీలుగా రిలీజ్ అవుతుంది. తొలిపార్ట్ వ‌చ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న థియేటర్లలోకి వస్తోంది. ఆ తర్వాత దేవర 2 షూటింగ్ ఉంటుంది. అయితే మధ్యలో ఎన్టీఆర్ వార్2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో కూడా నటిస్తారు.

దేవర షూటింగ్ తో పాటే వార్‌2 షూటింగ్ కూడా సమాంతరంగా జరగనుంది. వార్2 సినిమాలో ఎన్టీఆర్ తో పాటు బాలీవుడ్ కండ‌ల వీరుడు హృతిక్ రోషన్ నటిస్తుండడంతో సినిమాపై అంచ‌నాలు నెక్ట్స్‌ లెవెల్ కి చేరుకున్నాయి. ఈ సినిమాకి బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్, సౌత్ ఇండియా వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా షూటింగ్ పై ఓ ఇంట్రెస్టింగ్ బజ్‌ వినిపిస్తోంది.

మేకర్స్ ఈ సినిమా షూటింగ్ కోసం అంతా రెడీ చేశారని.. హృతిక్, ఎన్టీఆర్ త్వరలోనే ఈ సెట్స్ లో జాయిన్ కానున్నారని తెలుస్తోంది. వార్ 2 షూటింగ్ అంతా దాదాపు ఫారిన్ కంట్రీస్ లోనే జరుగుతుందని సమాచారం. డిసెంబర్ చివరివారం నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళనుంది. అప్పుడే ఎన్టీఆర్ కూడా షూటింగ్‌లో జాయిన్ అవుతాడు. ఈ సినిమా షూటింగ్ కోసం ద‌ర్శ‌కుడు ఆయాన్ ముఖర్జీ పలు ఫారిన్ కంట్రీస్ లో లొకేషన్స్ లాక్ చేశాడు.

ఇక షూటింగ్ ప్రారంభమయ్యాక హృతిక్‌, ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఎక్కువగా విదేశాల్లోనే ఉంటారని తెలుస్తోంది. ఇండియాలో, ముంబైలో కొన్ని పోర్షన్ల వరకు షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news