Newsమహేశ్ బాబు బంగారు కొండ..రాజమౌళితో సినిమా తరువాత ఫ్లాప్ నుంచి తప్పించుకోవడానికి...

మహేశ్ బాబు బంగారు కొండ..రాజమౌళితో సినిమా తరువాత ఫ్లాప్ నుంచి తప్పించుకోవడానికి ఏం చేస్తున్నాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఓ పిచ్చి సెంటిమెంట్ ఉంది, స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఏ హీరో అయితే నటిస్తాడో ఆ హీరో తర్వాత చేసే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ డిజాస్టర్ ప్లాప్ అవుతుంది . ఇప్పటివరకు అదే ఫార్ములా అదే సెంటిమెంట్ రిపీట్ అయింది . ఒకరు కాదు ఇద్దరు కాదు ఇండస్ట్రీలో ఉండే బోలెడు మంది హీరోస్ ఈ సిచువేషన్ ని ఫేస్ చేశారు .

ప్రభాస్ ఐతే బాహుబలి తర్వాత ఇప్పటివరకు హిట్ కొట్టిందే లేదు . అలాంటి ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో పాతుకుపోయింది . అయితే ఈ బ్యాడ్ సెంటిమెంట్ నుంచి బయటపడడానికి మహేష్ బాబు ఓ డిఫరెంట్ ఐడియాను ప్లాన్ చేస్తున్నాడట. రాజమౌళితో మహేష్ బాబు ఓ సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా అయిపోయిన తర్వాత మహేష్ బాబు ఏ డైరెక్టర్ తో చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే సింగిల్ గా కాకుండా ఈ సినిమాను బిగ్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిస్తే ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేయొచ్చు అనుకుంటున్నారట . కేవలం సినిమాలో ఆ హీరో ఒక్కరే ఉండడు.. మహేష్ బాబు తో పాటు మిగతా హీరోలు కూడా ఉంటారు . అలా సెంటిమెంట్ రిపీట్ అయిన తన వరకు ఫ్లాప్ రాదు . అలా రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నారట . చూద్దాం ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news