Newsవెంక‌టేష్ సినిమాలో బాల‌న‌టి ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్... ఎవ‌రా హీరోయిన్‌...!

వెంక‌టేష్ సినిమాలో బాల‌న‌టి ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్… ఎవ‌రా హీరోయిన్‌…!

చిన్నప్పుడు సినిమాలలో బాల నటీనటులుగా నటించిన వారు పెద్దయ్యక హీరోలు, హీరోయిన్లుగా చేయటం కామన్. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు సైతం చిన్నప్పుడు బాల నటులుగా నటించిన వాళ్లే. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, కళ్యాణ్ రామ్, అల్లు అర్జున్ వీళ్లంతా చిన్నప్పుడు సినిమాలలో నటించి ఇప్పుడు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలు అయ్యారు. అలాగే ఎంతోమంది హీరోయిన్లు చిన్నప్పుడు పెద్ద హీరోల సినిమాలలో నటించి తర్వాత హీరోయిన్లుగా మారుతూ ఉంటారు.

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సినిమాలో బాల‌న‌టిగా నటించిన ఒక నటి తర్వాత కాలంలో హీరోయిన్గా మారి ఏకంగా జూనియర్ ఎన్టీఆర్‌కి జోడిగా నటించింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ఎన్టీఆర్ తొలి సినిమా నిన్ను చూడాలని హీరోయిన్ రవీనా రాజ్‌పుత్. ఎన్టీఆర్ హీరోగా పరిచయమైన నిన్ను చూడాలని సినిమాను ఉషా కిరణ్ మూవీస్ బ్యాన‌ర్‌పై రామోజీరావు నిర్మించారు. నాగార్జునతో నువ్వు వస్తావని లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన వంకినేని రత్న ప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఎన్టీఆర్ హీరోగా పరిచయమైన ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి జోడిగా నటించిన రవీనా రాజ్‌పుత్ తర్వాత సినిమాల్లో పత్తా లేకుండా పోయింది. అయితే అంతకుముందు ఆమె బాలన‌టిగా విక్టరీ వెంకటేష్, కే.రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన ఒంటరి పోరాటం సినిమాలో నటించింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత 2001లో నిన్ను చూడాలని సినిమాలో హీరోయిన్గా చేసింది.

సౌత్ ఇండియాలోనూ.. అటు బాలీవుడ్ లోను.. కొన్ని సినిమాలలో నటించిన ఆమెకు అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. సరైన హిట్ సినిమాలు కూడా లేవు. దీంతో ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయిపోయింది. ఆ తర్వాత ఆమె గురించి ఎక్కడ ఎలాంటి కథనాలు రాలేదు. ఆమె ఏం చేస్తుందో కూడా ఎవరికి తెలియలేదు. అయితే రవీనా రాజ్‌పుత్ మాత్రం ఎన్టీఆర్ తొలి సినిమా హీరోయిన్గా చరిత్రలో నిలిచిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news