News' ఇంద్ర ' సినిమా విషయంలో ఇంత పెద్ద ర‌చ్చా... చిరు...

‘ ఇంద్ర ‘ సినిమా విషయంలో ఇంత పెద్ద ర‌చ్చా… చిరు వైపు కుర్చీ త‌న్నింది ఎవ‌రు…?

ఇంద్ర..మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఓ భారీ హిట్‌గా నిలిచింది. బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి సినిమా, నరసింహనాయుడు సినిమాలను చూసే చిరంజీవి ఇంద్ర చేశారు. ఇదోక ప్రభంజనం. చిన్నికృష్ణ కథ, బి.గోపాల్ దర్శకత్వం, పరుచూరి బ్రదస్ సంభాషణలు, మణిశర్మ సంగీతం, చిరు డాన్స్, సోనాలి బిందే, ఆర్తీ అగర్వాల్ గ్లామర్..ఇలా ప్రతీది సినిమా భారీ విజయానికి ప్లస్ అయ్యాయి.

అయితే, ఇంద్ర సినిమా కథ విషయంలో ఎన్నో కసరత్తులు జరిగాయి. షూటింగ్ సమయంలో పరుచూరి రాసిన కొన్ని డైలాగులు తూటాల్లా పేలాయి. ముఖ్యంగా షోకాతాలీఖాన్ దగ్గర దెబ్బలి తిని వచ్చే ముందు ఏదైనా డైలాగు ఉంటే బావుంటుందని షూటింగ్ స్పాట్ నుంచే చిరంజీవి పరుచూరికి చెప్పారట. అప్పుడే పుట్టిందే..తప్పు నావైపు ఉంది కాబట్టి తలదించుకొని వెళుతున్నాను..లేదంటే తలలు తీసుకెళ్ళేవాడిని..అని.

ఇలాంటి సంఘణలు ఎన్నో జరిగాయి. ముఖ్యంగా రచయిత చిన్నికృష్ణ ఓ సీన్ విషయంలో ఏకంగా మెగాస్టార్‌తోనే గొడవపడ్డారట. తులసి కోట పెట్టే సీన్ అది. స్క్రిప్ట్ మొత్తం చదివిన తర్వాత షూటింగ్ పూర్తైంది. రేపు రిలీజ్ అనగా చిరు తన ఫ్యాన్స్ ని ఆడవాళ్ళను దృష్ఠిలో పెట్టుకొని ఆ సీన్ తీసేద్దామని చెప్పారట పరుచూరి సోదరులతో. వాళ్ళు కథ చిన్ని రాశాడు కదా..అతనితో కూడా ఒకమాట చెప్పాలి అన్నారట. అదే మాట చిన్నికృష్ణతో చెప్తే ఏకంగా బూతులతో లేచాడట. ఎడితింగ్ రూం ఉన్న చిన్ని లేచి కుర్చీని వెనక్కి ఓ తన్ను తన్నాడట.

అది వెనకాల ఉన్న చిరంజీవికి తగిలిందట. కట్ చేస్తే ఆ సీన్ ఉంచాలనే అభిప్రాయాన్ని నిర్మాత అశ్వనీదత్ భార్య కూడా చెప్తూ చిన్నికృష్ణకి సపోర్ట్ చేసిందట. దాంతో అందరూ చిన్నికృష్ణ మాటని ఏకీభవించి ఉంచారట. సినిమా రిలీజయ్యాక అదే హైలెట్ అయింది. ఒక రచయిత ఎంత ఆలోచించి సీన్ రాస్తాడో తెలియడానికి ఇదొక పెద్ద ఉదాహరణ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news