Newsహీరోయిన్ త్రిష చేతిలో ఉన్న ఈ బాబు ఆ స్టార్ హీరోయిన్...

హీరోయిన్ త్రిష చేతిలో ఉన్న ఈ బాబు ఆ స్టార్ హీరోయిన్ కొడుకే…!

స్టార్ హీరోయిన్ త్రిష 40 ఏళ్ల వయసులోనూ ఇటీవల వరుస సినిమాలతో దూసుకుపోతోంది. కోలీవుడ్ క్రేజీ హీరో ఇళ‌య‌ దళపతి విజయ్ కి జోడిగా లియో సినిమాలో నటిస్తోంది. భారీ అంచనాలతో తెర‌కెక్కిన‌ లియో సినిమా ఈనెల 19న దసరా కానుకగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది. త్రిష‌ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాష‌ల్లో ఆమె కోట్లాది మంది అభిమానుల‌ను సొంతం చేసుకుంది.

ఈ ఏడాది మణిరత్నం భారీ మల్టీస్టారర్ పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుని అదే స్పీడ్‌తో దూసుకుపోతుంది. ఇటీవల త్రిష ఒక బాబుని ఎత్తుకొని కనిపించడంతో అతడు ఎవరు అన్నది ?సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా త్రిష మరోసారి షూటింగ్లో అదే బాబుని ఎత్తుకుని ఆడుతున్న‌ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు అసలు త్రిష చేతిలో ఉన్న ఆ బాబు ఎవరు ? అంటూ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.

చివరికి ఆ బాబు ఎవరో తేలిపోయింది. ఆ బుజ్జి బాబు ఎవరో కాదు.. ప్రముఖ మలయాళ నటి మియా జార్జ్ కుమారుడు. త్రిష కీలకపాత్రలో నటించిన మూవీ ది రోడ్‌. ఇందులో మలయాళ భామ మియా జార్జ్ కీలకపాత్రలో నటించారు. ఈ మూవీ షూటింగ్ టైంలో త్రిష ఇలా మియా జార్జ్ కొడుకుతో ఆడుకుంటూ కనిపించింది. దీనిని పక్కనే షూటింగ్లో ఉన్న వ్యక్తి వీడియో తీయడంతో ఇది బయటకు వచ్చింది.

ఇక ది రోడ్ అక్టోబర్ 6 న గ్రాండ్గా థియేటర్లలో విడుదల కానుంది. మియా జార్జ్ కొడుకు బలే క్యూట్గా ముద్దొస్తున్నాడని నిటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news