Newsహీరోయిన్ సంఘవి విడాకులకు లెజెండ్రీ నిర్మాత రామానాయుడుకు సంబంధం ఏమిటి..!

హీరోయిన్ సంఘవి విడాకులకు లెజెండ్రీ నిర్మాత రామానాయుడుకు సంబంధం ఏమిటి..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల చుట్టూ రకరకాల పుకార్లు షికార్లు చేస్తూ ఉండటం కామన్.. హీరోయిన్లు ఎవరి సపోర్ట్ లేకుండా ఎదగటం అంటే అంత ఆషామాసి విషయం కాదు. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్లు ఎన్నో ఇబ్బందులు పడితే కానీ ఛాన్సులు దక్కించుకోలేరు. చాలామంది హీరోయిన్లు హీరోలతో కానీ లేదా డైరెక్టర్లతో గానీ నిర్మాతలతో కానీ మంచి మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు.

ఇదిలా ఉంటే ఒకప్పుడు తెలుగులో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన కన్నడ ముద్దుగుమ్మ సంఘవి విషయంలో చాలా రూమర్లు వచ్చాయి. సురేష్ ప్రొడక్షన్స్ శ్రీకాంత్ హీరోగా వచ్చిన తాజమహల్ సినిమాలో సంఘవి సెకండ్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. రామానాయుడు మొదటి నుంచి సంఘవిని బాగా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు.
తర్వాత తన బ్యానర్ లో తెరకెక్కిన చాలా సినిమాలలో ఆయన సంఘ‌వి కి హీరోయిన్గా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు.

రామానాయుడు ఇచ్చిన ప్రోత్సాహంతోనే సంఘవి టాలీవుడ్లో హీరోయిన్గా మంచి మంచి అవకాశాలు తన ఖాతాలో వేసుకుని సక్సెస్ అయింది. అయితే ఆమె కెరీర్ పరంగా పామ్‌లో ఉన్నప్పుడే డైరెక్టర్ సురేష్ వర్మ ని పెళ్లి చేసుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వచ్చిన శివయ్య సినిమాకు సురేష్ వర్మ దర్శకుడు ఆ సినిమా టైంలో ఇద్దరు మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మరి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి రామానాయుడుకు ఇష్టం లేదని అంటారు.

సంఘవి హీరోయిన్గా ఫామ్ లో ఉందని ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందని ఆయన ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అయితే ఉన్నట్టు ఉండి సురేష్ వర్మ బుట్టలో సంఘవి పడిపోవడం రామానాయుడు కి ఇష్టం లేదు. ఆమె ఎప్పుడైతే సురేష్ వర్మను పెళ్లి చేసుకుందో రామానాయుడు తెరవెనక చక్రం తిప్పి ఆమె అప్పుడు నటిస్తున్న సినిమాలు నుంచి ఆమెను తీసివేసేలా చేశారని.. ఆమెకు ఆఫర్లు రాకుండా చేశారని అందుకే సంఘవి టాలీవుడ్ నుంచి త్వరగా ఫేడవుట్ అయ్యింద‌ని ప్రచారం ఉంది.

విచిత్రం ఏమిటంటే పెళ్లైన కొద్ది రోజులకే సురేష్ వర్మతో సంఘవికి మనస్పర్ధలు రావడంతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సంఘవి చాలా రోజులపాటు ఖాళీగా ఉండి బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంకటేష్ ని ప్రేమ వివాహం చేసుకొని మైసూర్లో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news