సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కట్టుకునే చీరలు.. ధరించే నగలు ..వేసుకునే యాక్ససరీస్ కి సంబంధించిన వార్తలు ఏ విధంగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కట్టుకునే చీరలు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . కాగా గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన కట్టుకున్న చీర అమ్మాయిలను తెగ ఆకట్టుకుంటుంది .
అంతేకాదు ఈ చీర చాలా సింపుల్ అండ్ స్టైలిష్ గా ఉండడంతో గర్ల్స్ యంగ్ స్టార్స్ కూడా బాగా అట్రాక్ట్ అవుతున్నారు. దీంతో రష్మిక మందన్నా కట్టుకున్న ఈ చీర డీటెయిల్స్ వైరల్ గా మారాయి .ఇటీవల రష్మిక ఓ ఈవెంట్ కోసం దుబాయ్ వెళ్లింది. అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది . అందులో చంకీ చంకీ అంటూ మెరిసిపోయే అద్దాల చీరకట్టి తన అందాన్ని డబుల్ స్దాయిలో మెరిసిపోయేల చేసుకుంది.
దీంతో రష్మిక మందన కట్టిన చీర వైరల్ గా మారింది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ చీర ఖరీదు దాదాపు 270000 గా తెలుస్తుంది. ఈ చీరకు ప్రత్యేకత కూడా ఉంది . దీనిపై చేసిన ఎంబ్రాయిడరీ పనిని కళాకారులు చేతితో చేశారు . అందుకే ఇంత కాస్ట్ . ఈ చీరని విజయ్ దేవరకొండ ఆమె బర్తడేఅకు గిఫ్ట్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు రష్మిక మందన కట్టుకున్న చీర ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..!!