Newsమేన‌మామ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ప్లాప్ టైటిల్ వాడేస్తోన్న సాయితేజ్‌...!

మేన‌మామ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ప్లాప్ టైటిల్ వాడేస్తోన్న సాయితేజ్‌…!

ప్రమాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. విరూపాక్ష సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఆ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. తర్వాత మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమా కూడా చేశాడు. విరూపాక్ష సూపర్ డూపర్ హిట్. అయితే బ్రో సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమాలో కథ అంతా సాయితేజ్‌ చుట్టు నడుస్తుంది. బ్రో రిలీజ్ అయ్యాక త‌న‌కు హెల్త్ స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని… కొంత కాలం విరామం తీసుకుంటాన‌ని ముందే ప్ర‌క‌టించారు.

ఈ క్ర‌మంలోనే కొంత విరామం తర్వాత మళ్లీ తన కొత్త సినిమాను సెట్స్ మీదకి తీసుకు వెళుతున్నాడు. సంప‌త్‌నందితో ఓ యాక్షన్ డ్రామా కోసం జతకట్టబోతున్నాడు. ఒకప్పుడు మాస్ సినిమాలు తెరకెక్కించటంలో పెట్టింది పేరు అయిన సంపత్ నంది ఇటీవల వరుస ప్లాపుల‌తో కాస్తంత వెనక పడ్డాడు. సంపత్ నంది ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సి ఉంది. ఈ క్రమంలోనే సంపత్ నంది – సాయి ధరంతేజ్ కాంబినేషన్లో తర్కెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

ఈ సినిమాకు గంజాయి శంకర్ అనే టైటిల్ పెట్టారు. ఇది జైలు నేపథ్యంలో సాగే కథ‌. డీసెంట్ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో సాయి తేజ ర‌గ్డ్ లుక్ లో కనిపించనున్నాడు. గతంలో సాయి తేజ్‌ మేనమామ పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ సినిమాలో నటించాడు. ఇది కూడా మాస్ సినిమా.. అయితే ప్రేక్షకుల అంచనాలు అందుకోలేదు.

అప్పుడు మేనమామ గుడుంబా శంకర్ గా ప్రేక్షకులు ముందుకు వస్తే.. ఇప్పుడు మేనల్లుడు గంజాయి శంకర్ గా రాబోతున్నాడు. అటు మేనమామ.. ఇటు మేనల్లుడు ఇద్దరు సినిమాలలో శంకర్ టైటిల్ కామన్ గా కనిపిస్తుంది. మరి ఈ శంకర్ టైటిల్ తో సాయితేజ్ తన హిట్ ట్రాక్ కంటిన్యూ చేస్తాడని ఆశిద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news