Moviesవావ్: ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీసం మెలివేసే న్యూస్.. ఎన్ని కోట్లు ఇచ్చినా...

వావ్: ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీసం మెలివేసే న్యూస్.. ఎన్ని కోట్లు ఇచ్చినా రాని ఆనందం ఇది ..!!

వావ్ .. ఇది నిజంగా నందమూరి అభిమానులు ఎంతో ఆనందించాల్సిన విషయం . టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ..ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు . గ్లోబల్ స్టార్ అనిపించుకున్నాడు. ఇప్పటికే పలు అవార్డులు గౌరవాలు అందుకున్న ఎన్టీఆర్ ..తాజాగా మరో ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందుకున్నాడు .

ఆస్కార్ తన కొత్త మెంబర్స్ లిస్ట్ ని ప్రకటించింది . ఈ లిస్టులో ఇండియా నుంచి ఎన్టీఆర్ ఆ స్థానం దక్కించుకున్నాడు . దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు. యాక్టర్స్ బ్రాంచ్ మెంబర్గా ఎన్టీఆర్ కి అకాడమీ అరుదైన గౌరవాన్ని ఇవ్వడం పట్ల ఫ్యాన్స్ ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని అభిమానులు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు .

“నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది అన్నా “అంటూ ఎంతో ప్రేమగా కామెంట్స్ చేస్తున్నారు .దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా గతంలో అకాడమీ తన కొత్త సభ్యుల జాబితాని కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ లిస్ట్ లో ఇండియా నుంచి 8 మంది ఉన్నారు. అందులో 6 గురు ఋఋఋ సినిమా టీంకి చెందిన వాళ్ళు అయితే మిగిలిన ఇద్దరు.. కరణ్ జోహార్, షౌనక్ సేన్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news