Moviesవరుణ్ తో పెళ్లి..నీహారిక సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న లావణ్య.. కొత్త...

వరుణ్ తో పెళ్లి..నీహారిక సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న లావణ్య.. కొత్త కోడలు ఐడియా అదుర్స్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ మరి కొద్ది గంటల్లోనే లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారు. ఇన్నాళ్లు ప్రేమ పక్షులుగా తిరిగిన ఈ జంట మరికొద్ది గంటల్లోనే భార్యాభర్తలు గా మారబోతున్నారు. దీంతో వీళ్ళకి సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

కాగా ఇప్పటికే మెగా – అల్లు – కామినేని – లావణ్య త్రిపాఠి కుటుంబం ఇటలీ చేరుకుంది. కాగా లావణ్య త్రిపాఠి తన పెళ్లిలో నిహారిక ఫాలో అయిన పద్ధతిని ఫాలో అవుతుందట . ఈ మధ్యకాలంలో ఇది ఓ ట్రెండ్ ల మారిపోయింది . అమ్మ పెళ్లి చీరను తమ పెళ్ళికి కట్టుకుంటూ మురిసిపోతున్నారు కూతుళ్లు.

నిహారిక సైతం అదే ట్రెండ్ ఫాలో అయింది . తన తల్లి పట్టుచీరను తన పెళ్లికి కట్టుకొని సంబరపడిపోయింది . ఇప్పుడు లావణ్య సైతం అదే పని చేస్తుందట. హల్దీ ఫంక్షన్ కోసం తన తల్లి చీరను రీ క్రియేట్ చేస్తుందట . దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు మెగా అభిమానులు సైతం లావణ్య త్రిపాఠి చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news