Newsసితార ధ‌రించిన ఈ లెహంగా రేటు తెలిస్తే దిమ్మ‌తిరిగి పోద్ది... మ‌హేష్...

సితార ధ‌రించిన ఈ లెహంగా రేటు తెలిస్తే దిమ్మ‌తిరిగి పోద్ది… మ‌హేష్ కూతురా మ‌జాకానా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ సూపర్ స్టార్ వార‌సురాలిగా చిన్న వయసులోనే సితార సోషల్ మీడియాలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారన్న సంగ‌తి తెలిసిందే. చిన్న వయసులోనే స్పెషల్ యూట్యూబ్ ఛానల్ తో రకరకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా మారిపోయారు. సితార పాపా తాజాగా ఒక నగల సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంది.

ఇంత చిన్న వయసులో బ్రాండ్ అంబాసిడర్‌గా కోటి రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఇక సితార ఇటీవల కాలంలో పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కూడా పాల్గొంటున్నారు. వారు సంపాదించిన మొత్తం ఛారిటీకి విరాళంగా ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో సితార చేసే వీడియోలతో పాటు ఫోటోలకు ఏ స్థాయిలో పాపులారిటీ ఉందో చెప్పక్కర్లేదు.

ఇక సితారను మహేష్ బాబు దంపతులు ఇద్దరు వెండితెరకు లేదా ఇటు బుల్లితెరకు హీరోయిన్‌గా పరిచయం చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సితార తన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తే మిలియ‌న్ల‌లో వ్యూస్ వస్తున్నాయి. దసరా పండుగ సందర్భంగా కూడా సితార ఒక డ్యాన్స్ వీడియోను అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దసరా సందర్భంగా సితార ఎరుపు రంగు లెహంగా ధరించి ఎంతో క్యూట్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఈ రెడ్ కలర్ లెహంగా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీ డిజైనర్ వ‌రుణ్ చ‌కిలం డిజైన్ చేసిన ఈ లెహంగా రేటు సుమారు రూ.2.5 లక్షలకు పైనే ఉంటుందట. ఈ రేటు తెలియడంతో సినీ అభిమానులు వామ్మో.. మహేష్ బాబు కూతురు అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ.. సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news