Moviesభగవంత్ కేసరి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్: ఆ క్రేజీ...

భగవంత్ కేసరి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్: ఆ క్రేజీ రికార్డులను తుక్కు తుక్కు చేసిన బాలయ్య..మొత్తం ఎన్ని కోట్లంటే..!

ఇది నందమూరి సత్తా అంటే. ఇది కదా నందమూరి ఫ్యాన్స్ కోరుకునేది . నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా భగవంత్ కేసరి . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయి ..మొదటి షో తోనే బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది .

అంతేకాదు ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమాలు రాలేదు. అలాంటి ఓ హెల్ది అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేశాడు భగవంత్ కేసరి సినిమా ద్వారా అనిల్ రావిపూడి . ఈ సినిమా చిన్న – పెద్ద . తండ్రి – కూతుర్లు, తండ్రి – కొడుకు, తల్లి – కొడుకు ఇలా అందరూ కలిసి చూసే సినిమా కావడంతో థియేటర్స్ లో సినిమాను చూడడానికి జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు .

ఈ క్రమంలోనే భగవంత్ కేసరి ఫస్ట్ డే కలెక్షన్స్ దుమ్ము దులిపేసాయి . ఇప్పటివరకు బాక్సాఫీస్ డీసెంట్ టాక్ రావడంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా అదిరిపోయే వసూళ్లను అందుకుంది . ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. భగవంతు కేసరి విస్పోటనం అంటూ ట్వీట్ చేస్తూ ఈ సినిమా ఫస్ట్ డే 32.33 కోట్లు గ్రాస్ తో స్టార్ట్ అయినట్లు కన్ఫామ్ చేసింది . దీనితో బాలయ్య భగవంత్ కేసరితో మరో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . మొత్తానికి మొదటి రోజే 32 కోట్లు అంటే ఇక రెండు రోజుల్లో 100 కోట్లు క్రాస్ చేసేస్తుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news