Newsఐశ్వ‌ర్యారాయ్‌కు అత్తింటి వేధింపులు... ఆ ఇంట్లో అస‌లేం జ‌రుగుతోంది..!

ఐశ్వ‌ర్యారాయ్‌కు అత్తింటి వేధింపులు… ఆ ఇంట్లో అస‌లేం జ‌రుగుతోంది..!

బాలీవుడ్ బిగ్‌బి అమితాబచ్చన్ తాజాగా తన 81వ పుట్టినరోజును గ్రాండ్గా జరుపుకున్నారు. అమితాబ్‌ పుట్టినరోజు సందర్భంగా చాలామంది సెలబ్రిటీలు.. ఆయన అభిమానులు ఆయనకు స్పెషల్గా శుభాకాంక్షలు చెప్పారు. ఇక సోషల్ మీడియాలో అమితాబ్‌ అభిమానులు చేసిన హంగామా అంతా అంతా కాదు. అయితే అమితాబచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ మాత్రం ఒకరోజు ఆలస్యంగా తన మామకు బర్త్ డే విషెస్ తెలిపింది.

అయితే ఐశ్వర్య తన సోషల్ మీడియా ఖాతాలో అమితాబచ్చన్ తన కూతురు ఆరాధ్య‌తో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ మీరు ఎప్పటికీ ఇలాగే భగవంతుడు ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంది. ఐశ్వర్య పెట్టిన పోస్ట్ బాగానే ఉన్నా అందులో ఒక సందేహాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఐశ్వ‌ర్య‌ షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేసి పెట్టింది.. అసలు ఫోటోలో అమితాబచ్చన్ మనవరాలు ఆరాధ్య‌తో పాటు భార్య జయాబ‌చ్చ‌న్‌.. అలాగే తన ఆడపడుచు పిల్లలతో కలిసి ఉన్న ఫోటో ఉంది.

అయితే ఈ ఫోటో నుంచి వీరందరినీ ఎడిట్ చేసి కేవలం అమితాబచ్చన్ – ఆరాధ్య ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు మాత్రమే క్రాప్ చేసి పోస్ట్ చేసింది. ఐశ్వర్య బయటపెట్టిన ఈ పోస్టుల్లో అంత ఆశ్చర్యం లేకపోయినా కొంతమంది కావాలని ఈ పోస్ట్ వైరల్ చేస్తూ.. ఇందులో ఏదో అనుమానపడే విష‌యం ఉందని ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ కుటుంబంలో ఐశ్వర్య రాయ్‌కు తన అత్తగారు జాయ‌బచ్చన్‌కు మధ్య సఖ్యత లేదని.. గత కొన్నేళ్లుగా వీరిద్దరి వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని.. ఇటు భర్త అభిషేక్ కూడా.. ఇటు భార్య ఐశ్వర్య.. అటు అమ్మ జయ బుచ్చన్ మ‌ధ్య స‌ఖ్య‌త కుద‌ర్చ‌లేక చేతులు ఎత్తేశార‌ని… దీంతో ఐశ్వర్య ఇంటికి దూరంగా ఉంటుందని కూడా ప్రచారం జరుగుతోంది.

ఈ కారణంగానే ఐశ్వర్యరాయ్ కావాలనే వీరి ఫోటోలు ఎడిట్ చేసి తన కూతురు, మామయ్య ఫోటోలు మాత్రమే పెట్టుకుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఐశ్వర్య – అభిషేక్ మధ్య అంత సఖ్యత లేదన్న ప్రచారం అయితే ముంబై సీనిమా వ‌ర్గాల్లో గట్టిగా జరుగుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news