Moviesకత్రిన కైఫ్ ప్రెగ్నెంటా..? విక్కి కౌశల్ ఎంత సిగ్గుపడిపోతున్నాడో చూడండి..!!

కత్రిన కైఫ్ ప్రెగ్నెంటా..? విక్కి కౌశల్ ఎంత సిగ్గుపడిపోతున్నాడో చూడండి..!!

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్న అందరికీ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ – హీరోయిన్ కత్రినా కైఫ్ . ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంత హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ 2021 డిసెంబర్లో గ్రాండ్గా కత్రినా కైఫ్ ను పెళ్లి చేసుకున్నారు . హిందూ సంప్రదాయంలోనే వీరి వివాహం వేడుక జరగడం గమనార్హం. కాగా వీరి పెళ్లై రెండేళ్లు దగ్గరపడుతుంది. ఇప్పటికీ వీళ్లి గుడ్ న్యూస్ ప్రకటించ లేదు.

బాలీవుడ్ లో పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీలు ప్రకటిస్తున్న ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత కూడా కత్రీనా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయకపోవడం అభిమానులకు బాధాకరంగా ఉంది . అంతేకాదు ఈ మధ్యకాలంలో కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి . దీనిపై స్పందించాడు కత్రినా భర్త విక్కీ కౌశల్ . ప్రస్తుతం తన తదుపరిచిత్రం “ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ” విడుదలకు సిద్ధంగా ఉంది . ఈ నెల 22న సినిమా రిలీజ్ కాబోతుంది .

ప్రమోషన్స్ లో భాగంగా ఓ రేడియో సిటీ ఇండియాకు వచ్చిన విక్కీ కౌశల్ తన భార్య కత్రినా కైఫ్ పై కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తుందన్న విషయం పై స్పందించారు. ఆయన మాట్లాడుతూ..” మొదట మా డేటింగ్ విషయం ఇంట్లో మా అమ్మ నాన్నకు అందరికీ తెలుసు.. ఇక మా నుంచి గుడ్ న్యూస్ కోసం ఇంట్లో ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారని.. ఫోర్స్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి . దాంతో ఎటువంటి వాస్తవం లేదు . వాళ్ళు మమ్మల్ని ..మా ఫీలింగ్స్ ని గౌరవిస్తారు.. చాలా ప్రశాంతమైన వారు” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ రూమర్లకు చెక్ పడింది . అంతే కాదు విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ గుడ్ న్యూస్ చెప్తే వినాలి అన్నది కోట్లాదిమంది అభిమానులు కోరిక .. మరి అంతటి గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారో ఈ జంట వేచి చూద్దాం ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news