Moviesబిగ్ బాస్ 7 ఎలిమినేషన్ లో ఉల్టా పల్టా: లాస్ట్ మినిట్...

బిగ్ బాస్ 7 ఎలిమినేషన్ లో ఉల్టా పల్టా: లాస్ట్ మినిట్ లో షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరు ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్..!?

తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అతి పెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అయిన బిగ్బాస్ ప్రెసెంట్ ఎలాంటి టాప్ టిఆర్పి రేటింగ్స్ తో ముందుకు వెళ్తుందో తెలిసిందే. ఇప్పటికే ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ రీసెంట్ గానే ఏడవ సీజన్ కంప్లీట్ చేసుకుంది . చాలా హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య బడా కంటెస్టెంట్స్ కూడా హౌస్ లోపలికి వెళ్లారు. మరీ ముఖ్యంగా ఈసారి అబ్బాయిలకు పోటీ ఇచ్చే విధంగా అమ్మాయిలను కూడా చూస్ చూస్ చేసుకోవడం బిగ్ బాస్ కు మరింత ప్లస్ అయింది.

కాగా చూస్తూ చూస్తూనే ఓ వారం గడిచిపోయింది . ఈ వారం హౌస్ నుంచి ఓ వ్యక్తి ఎలిమినేట్ అవ్వక తప్పదు. నాగార్జున అన్నట్టే మొత్తం ఉల్టా పల్టాగా నామినేషన్ ప్రక్రియ జరిగింది . ఇంట్లో నుంచి వెళ్లిపోయే కాంటెస్టెంట్ ని కూడా ఎవరు గెస్ చేయలేరు . అంత టఫ్ గా ఓటింగ్ జరిగింది . ఆదివారం ఎపిసోడ్ షూటింగ్ నిన్న పూర్తి కావడంతో ఎవరు ఎలిమినేట్ అయ్యారనే విషయం సోషల్ మీడియాలో లీక్ అయిపోయి వైరల్ గా మారింది .

నామినేషన్ లో ఉన్న వారిని ఒక్కొక్కరిగా సేవ్ చేసుకుంటూ రాగ,, చివర్లో ప్రిన్స్ యావర్, కిరణ్ ఇద్దరు మిగిలారట . వీరిలో కిరణ్ రాథోడ్ ని హౌస్ నుంచి పంపించేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఆమెకు తెలుగు రాక అష్ట కష్టాలు పడుతుందని .. హౌస్ లో ఉండి ఇబ్బందులు పడడం కన్నా బయటికి వెళ్లిపోవడమే మంచిదని హౌస్ లోని కంటెస్టెంట్లు పెద్ద హృదయంతో ఎలిమినేట్ చేశారట. తెలుగు రాని వాళ్లు హౌస్ లో ఉంచడం ఎందుకు అనుకున్నారో ఏమో..? అందుకే ఆమెను ఎలిమినేట్ చేశారు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news