Moviesఆ తెలుగు హీరోతో ప్రభాస్ బిగ్ మల్టీస్టారర్ ఫిక్స్.. కృష్ణం రాజు...

ఆ తెలుగు హీరోతో ప్రభాస్ బిగ్ మల్టీస్టారర్ ఫిక్స్.. కృష్ణం రాజు కోరిక తీరిపోయిన్నట్లేగా..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ ల మూవీ ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది . ఒకప్పుడు ఒక హీరో కోసం ఇంకొక హీరో సహాయపడే వారే కాదు. కానీ ఇప్పుడు మారిపోతున్న కాలానికి పెరిగిపోతున్న టెక్నాలజీకి ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ ల మూవీ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. స్టార్ ప్రముఖులు జనాలు కూడా.. దాన్ని లైక్ చేస్తూ ఉండడంతో డైరెక్టర్ అలాంటి క్రేజీ కావాలని సెట్ చేయడానికి ఇష్టపడుతున్నారు .

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ఓ హీరో సినిమాలో గెస్ట్ రోల్ లో నటించడానికి యాక్సెప్ట్ చేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ ట్రెండ్ అవుతుంది. హీరో ప్రభాస్ – మంచు విష్ణు నటిస్తున్న సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . కన్నప్ప పాత్రలో ప్రభాస్ మనకు కనిపించబోతున్నాడట. రీసెంట్ గానే హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ను అఫీషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే . శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది.

భారీ బడ్జెట్ తో మంచు విష్ణు కన్నప్ప ప్రాజెక్టును చేస్తున్నారు. శ్రీ ఆగస్టులో కాళహస్తిలో ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి . కాగా ఈ సినిమాను స్వయంగా మోహన్ బాబు నిర్మిస్తూ ఉండడం విశేషం . అంతేకాదు ఆయన ఓ కీలక పాత్రలో కూడా నటిస్తున్నారట . బాలీవుడ్ నుపూర్ సనన్ హీరోయిన్గా నటిస్తుంది . హిందీ మహాభారతం సీరియల్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు .

కాగా ఈ ప్రాజెక్టులో కన్నప్ప పాత్రలో హీరో ప్రభాస్ స్పెషల్ గెస్ట్ రోల్ చేయబోతున్నారట . ఇది రెబెల్ అభిమానులకు నిజంగా ఓ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కెరియర్లో ఎంతో మైలురాయిగా నిలిచిన చిత్రం భక్తకన్నప్ప . దాని రీమేక్ చేసే ఆలోచన ఉందన్నారు ప్రభాస్ . అనూహ్యంగా కన్నప్ప సినిమాను మంచు విష్ణు ప్రకటించారు . మరి అలాంటి సినిమాలో ప్రభాస్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అని తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news