Newsశ్రీలీల‌ - ర‌ష్మిక ఒక‌రికి ఒక‌రు భ‌లే షాక్‌లు ఇచ్చుకున్నారే...!

శ్రీలీల‌ – ర‌ష్మిక ఒక‌రికి ఒక‌రు భ‌లే షాక్‌లు ఇచ్చుకున్నారే…!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ఇద్దరు టాప్ క్రేజీ హీరోయిన్లు రష్మిక – శ్రీలీల‌. వీరిద్దరూ వ‌రుస‌ అవకాశాలతో దూసుకుపోతున్నారు. అయితే తాజాగా ఈ ఇద్దరు భామలు ఒకరికి ఒకరు దిమ్మతిరిగే షాక్ లు ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ వర్గాల్లో హైలెట్గా మారింది. రెండు సినిమాలలో ఒకరి స్థానంలో మరొకరు మారారు. గౌతమ్ తిన్న‌నూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఇది విజయ్ దేవరకొండ కెరీర్‌లో 12వ సినిమాగా రానుంది. ఇందులో హీరోయిన్గా శ్రీలీల‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. విజయ్ – శ్రీలీలకు సంబంధించిన ఫోటోషూట్ కూడా నిర్వహించారు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి శ్రీలీల‌ తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఆమె స్థానంలో రష్మికను తీసుకున్నారు. దీంతో విజయ్ దేవరకొండ – రష్మిక కాంబినేషన్ మరోసారి అలరించనుంది.

ఇక వెంకి కుడుముల‌ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ సినిమా మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి ఈ సినిమా ప్రారంభించారు. ఈ సినిమాలో హీరోయిన్గా మొదట రష్మికను ఎంపిక చేశారు. ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకోగా ఆమె స్థానంలో శ్రీలీల‌ను హీరోయిన్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు ఇప్పటికే ఆమెను కలిసి కథ చెప్పారని నితిన్ జోడిగా నటించేందుకు శ్రీలీల‌ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం నితిన్ – శ్రీలీల కాంబినేషన్లో ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప 2 – రెయిన్‌బో – యానిమల్ సినిమాలు ఉన్నాయి. ఇక శ్రీలీల‌ చేతిలో స్కంద – భగవంత్‌ కేసరి రిలీజ్ కు రెడీగా ఉండగా మరో ఏడెనిమిది సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news