Moviesడైనో ’ సలార్ ’ కు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్‌…...

డైనో ’ సలార్ ’ కు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్‌… ప్ర‌భాస్ బాక్సాఫీస్‌ ఊచ‌కోత‌కు ముహూర్తం ఇదే..!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్‌గా హీరోయిన్గా సెన్సేషనల్ మాస్ తెలుసుకోవడం ప్రశాంత్ నీల్‌ తెరకెక్కిస్తున్న భారీ యాక్ష‌న్ సినిమా కోసం ఇండియన్ సినిమా జనాలు అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటేనే గుస్‌బంప్స్ మోత మోగిపోతుంది. అయితే గత వారం రోజుల నుంచి అనుకున్న డేట్ కి రావట్లేదు అని వార్తలు వస్తున్నాయి. ఇది అనధికారికంగా కన్ఫామ్ కూడా అయిపోయింది. దీంతో సోలార్ డేట్ కు చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి. అయితే ఈ ప్రెస్టేజ్ ప్రాజెక్టు కొత్త రిలీజ్ డేట్ పై సరికొత్త సమాచారం వచ్చింది. ఈ దీపావళి బరిలోనే ఈ సినిమాను దింపాలి అని మేకర్స్ భావిస్తున్నారట.

మొట్టమొదటిగా అయితే నవంబర్ 10న ఈ డైనోసార్ ని బాక్సాఫీస్ బరిలోకి దింపేందుకు మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ రోజు ప్ర‌భాస్ బాక్సాఫీస్ ఊచ‌కోత మొద‌లైన‌ట్టే అనుకోవాలి. ఇదే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ అనుకోవచ్చు అని అంటున్నారు. దీనిపై త్వరలోనే మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును కేజిఎఫ్ సిరీస్ సినిమాలు నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత విజయ్ కిరంగాదూర్ నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news