Moviesఆ వ్యక్తిని చూసి ముఖం తిప్పుకుని ఎయిర్ పోర్ట్ నుంచి...

ఆ వ్యక్తిని చూసి ముఖం తిప్పుకుని ఎయిర్ పోర్ట్ నుంచి పారిపోవాలనుకున్న సమంత.. అంత భయపడుతుందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఇండియాలో అడుగుపెట్టింది.. ఇక అదే సమయంలో ఆమె ఎయిర్పోర్టులో ఓ వ్యక్తికి భయపడిందట. ఇది నిజమా లేదా రూమర్ అని అందరూ అనుకుంటున్నారు. అయితే నిజంగానే సమంత ఆ వ్యక్తిని చూసి ఎయిర్పోర్టులో భయపడి పారిపోయిందట. అంతేకాకుండా ఆ వ్యక్తికి కనిపించకుండా తప్పించుకుని వెళ్లాలని చూసినప్పటికీ చివరికి ఆ వ్య‌క్తి నుంచి సమంత తప్పించుకోలేక పోయిందట.

ఇక ఇంతకీ సమంత అంతలా భయపడే ఆ వ్యక్తి ఎవరు..? ఆ వ్యక్తి నుంచి తప్పించుకుని ఎందుకు వెళ్లాలనుకుంది. అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. సమంత ఖుషి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఈ మూవీ విడుదల అయ్యే ముందు విదేశాలకు వెళ్లి మయాసైటిస్ కు ట్రీట్మెంట్ తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.అలాగే న్యూయార్క్ లో ఇండియా పరేడ్ ర్యాలీ లో కూడా ఈ భామ సందడి చేసింది. అలాంటి సమంత అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి జాలిగా ఎంజాయ్ కూడా చేసింది.అలాగే ట్రీట్మెంట్ కోసం దాదాపు రెండు నెలల పాటు అక్కడే ఉంటుంది అని సమంత పై రూమర్స్ వినిపించాయి.

ప్ర‌స్తుతం వ‌స్తున్నా ఈ వార్తలన్నీ పక్కన పెడితే.. సమంత తాజాగా ఇండియా వచ్చింది. ఈరోజు ఉదయం ఎయిర్పోర్ట్ లో సమంత దర్శనం ఇచ్చింది. అయితే ఇంత హఠాత్తుగా సమంత ఇండియాకు ఎందుకు వచ్చింది. ఏదైనా ముఖ్యమైన పని ఉందా అని కొంతమంది ఆలోచనలో పడ్డారు. అయితే ఉదయం ఎయిర్పోర్ట్‌లోకి రాగానే సమంత ఓ వ్యక్తికి కనిపించకుండా పారిపోవాలని చూసిందట. అయినప్పటికీ ఆ వ్యక్తికి సమంత దొరికిపోయిందట.

ఇక సమంత ఎయిర్ పోర్ట్ లో కమలేష్ అనే ఫోటోగ్రాఫర్ కంటికి కనిపించకుండా పారిపోవాలని చూసిందట. కానీ చివరికి కమలేష్ కంట సమంత పడింది. దాంతో సమంతని ఫొటోస్ తీస్తూ ఉండగా ఏంటండి నేను మిమ్మల్ని తప్పించుకొని పారిపోవాలని అనుకున్నాను.. కానీ చివరికి ఇలా దొరికిపోయాను ఏంటి అంటూ సమంత మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news