Newsఏఆర్‌. రెహ్మ‌న్ సూప‌ర్ కారు రేటు చూస్తే మ‌తి పోయి.. మాట...

ఏఆర్‌. రెహ్మ‌న్ సూప‌ర్ కారు రేటు చూస్తే మ‌తి పోయి.. మాట రాదంతే..!

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా తిరుగులేని పాపులర్ పర్సన్. సింగర్, సాంగ్స్ రైటర్, రికార్డు ప్రొడ్యూసర్, మ్యూజిక్ కంపోజర్ గా మాత్రమే రెహమాన్ గురించి చాలామందికి తెలుసు. కానీ రెహమాన్ కు కార్లు అంటే చాలా ఇష్టం. త‌న ఇంట్లో ఎన్నో టాప్ క్లాస్ కార్ల‌ను క‌లిగి ఉంటాడు. ఇటీవల ఇటలీ బ్రాండ్ కారు కొనుగోలు చేశాడు ఏఆర్ రెహమాన్..

రెహ్మ‌న్ ఇటీవల లంబోర్ఘిని ఉరుస్‌ ఎస్ సూపర్ కారుని కొనుగోలు చేశాడు. ఈ కారు ధర 4.18 కోట్లు. తెలుపు రంగులో కనిపించే ఈ కారు చెన్నైలోని డీటైలింగ్ స్టూడియో వద్ద కనిపించింది. అయితే రెహమాన్ ఈ కారు ఎప్పుడు ? కొన్నాడు అన్నది స్పష్టంగా వెల్లడి కాలేదు. లంబోర్ఘిని ఉరుస్ అనేది బ్రాండ్ లైన్లో రెండో మోడల్. మొదటిది ఉరస్ పెర్ఫార్మంటే.

లంబోర్ఘిని ఉరుస్ ఎస్ 4.0 లీటర్ ట్వీన్‌ ట‌ర్బో చార్జ్ వీ8 పెట్రోల్ ఇంజ‌న్‌తో 666 బీహెచ్‌పీ ప‌వ‌ర్ & 850 ఎన్‌ఎం టార్క్ అందిస్తుంది. ఇది కేవ‌లం 3.3 సెక‌న్ల‌లో గంట‌కు 0 నుంచి 100 కిలోమీట‌ర్ల వేగ‌వంతం అవుతుంది.

లంబోర్ఘిని ఉరస్ ఎస్ కలిగిన సెలబ్రిటీల జాబితాలో రెహమాన్ మాత్రమే కాకుండా సచిన్ టెండుల్కర్ – రోహిత్ శెట్టి – బాద్షా – రణవీర్ సింగ్ – రోహిత్ శర్మ – రజనీకాంత్ – కార్తీక్ ఆర్య – ఆకాశ్‌ అంబానీ – జూనియర్ ఎన్టీఆర్ – జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ కూడా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news