Newsవిఘ్నేష్‌తో పెళ్ల‌య్యాక కూడా న‌య‌న‌తార వాళ్ల‌తో డేటింగ్‌లోనా... షాకింగ్ నిజాలు..!

విఘ్నేష్‌తో పెళ్ల‌య్యాక కూడా న‌య‌న‌తార వాళ్ల‌తో డేటింగ్‌లోనా… షాకింగ్ నిజాలు..!

సౌత్ ఇండియన్ లేడీస్ సూపర్ స్టార్ నయనతారకు తనకంటే వయసులో ఏడాది చిన్నోడు అయినా విఘ్నేష్ శివ‌న్‌తో పెళ్లి అయిన సంగతి తెలిసిందే. వయసులో తనకంటే ఏడాది చిన్నోడు అయినా యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివ‌న్‌తో ప్రేమలో పడిన న‌య‌న్‌ కొన్నాళ్లపాటు డేటింగ్ చేసి చివరకు పెళ్లి చేసుకుంది. ఈ దంపతులు సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. పెళ్లయ్యాక కూడా నయనతార కొందరు కోలీవుడ్ నటులతో డేటింగ్ చేస్తుందా ? అంటే టాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ శ్రీరెడ్డి అవుననే అంటోంది.

శ్రీరెడ్డి తరచూ సినీ ప్రముఖులు.. రాజకీయ నాయకులపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో దుమారం రైపుతోంది. ఎవరు ఏమనుకున్నా తన నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ శ్రీరెడ్డి వివాదాల్లో చిక్కుకుంటుంది. తాజాగా శ్రీరెడ్డి తనను తాను నయనతారతో పోల్చుకుంటూ నెటిజన్ల‌కు సమాధానం ఇచ్చింది. ఇటీవల శ్రీరెడ్డి అందరిపై ఆరోపణలు చేయడంతో నెటిజన్లు నీకే ఎ… ఫైర్లు ఉన్నాయి.. అలాంటి నువ్వు నీతులు చెప్పటం ఏంటి ? అంటూ విమర్శిస్తున్నారు.

దీంతో శ్రీరెడ్డి రెచ్చిపోయింది… నా సె…వల్ లైఫ్‌ గురించి మాట్లాడటానికి మీరు ఎవరు ? స్టార్ హీరోయిన్లు ఎవరైనా ఇలాంటి ప్రశ్నలు వేస్తారా ? నన్నే ఎందుకు మీరు ప్రశ్నిస్తున్నారు. హీరో నయనతారకు ఎఫై… ర్లు లేవా ? ఆమెకు పెళ్లయినా కూడా కొంద‌రు న‌టుల‌తోఇంకా డేటింగ్ చేస్తుంది. ఆమెను ఎవరైనా ?అడుగుతున్నారా నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని ప్ర‌శ్నించింది.

మీరు స్టార్ హీరోయిన్లను ఎందుకు అడగటం లేదు.. నాలాంటి చిన్న ఆర్టిస్టులను మాత్రం మీరు ఆడేసుకుంటున్నారు అంటూ శ్రీ రెడ్డి నెటిజ‌న్ల‌పై మండిపడుతూ వ్యాఖ్యలు చేసింది. దీంతో నయనతార ఫ్యాన్స్ ఇప్పుడు శ్రీరెడ్డిపై ఫైర్ అవుతూ నీకు అంత గొప్ప హీరోయిన్ కు పోలిక ఏంటి ? అసలు అని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news