Newsఅత‌నొక్క‌డే మ‌గాడు... మ‌హిళ‌ల‌ను క‌న్నెత్తి చూడ‌డు... హీరోయిన్ కంగ‌న మ‌న‌సు దోచిన...

అత‌నొక్క‌డే మ‌గాడు… మ‌హిళ‌ల‌ను క‌న్నెత్తి చూడ‌డు… హీరోయిన్ కంగ‌న మ‌న‌సు దోచిన హీరో ఎవ‌రంటే..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌ ఎప్పటికప్పుడు ఎవరో ఒకరిపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. చివరకు ఆమె గతంలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన ప్రభుత్వంతో సైతం ఢీకొట్టింది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోలు.. స్టార్ హీరోయిన్లు వారి మధ్య ఉన్న చీకటి ఒప్పందాల గురించి ఎప్పటికప్పుడు కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూనే వస్తోంది.

ఇక బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ తనను మోసం చేశాడంటూ కంగనా మృతికి ఎన్నోసార్లు ఒక ఆటాడుకుంది. ఇండస్ట్రీలో దాదాపు ప్రతి హీరోపై ఏదో ఒక విమర్శ చేసే కంగనా బాలీవుడ్ సీనియర్ హీరో జాన్ అబ్రహం పై మాత్రం తాజాగా ప్రశంసలు కురిపించింది. తన ఇన్‌స్టా స్టోరీలో జాన్ ఫోటో షేర్ చేస్తూ ఎంతోమంది నెగటివ్ పీపుల్ కలిగి ఉన్న బాలీవుడ్ సినిమా పరిశ్రమలో జాన్ అబ్రహం వంటి దయగల వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పింది.

జాన్‌ నిజాయితీగల నటుడు.. ఇండస్ట్రీ వ్యక్తులను తన సొంత కుటుంబంలా చూస్తాడు. మహిళలను అస్సలు వేధించడు. పి.ఆర్, గ్రూపిజం గురించి పట్టించుకోడు. ప్రతికూల వ్యక్తుల గురించి మాత్రమే కాదు.. ఇలాంటి వారిని మనం ఎప్పటికీ మరిచిపోకూడదు.. నేను జాన్ తో కలిసి పని చేసిన అనుభవంతోనే ఇవన్నీ చెబుతున్నానని కంగ‌నా చెప్పింది. జాన్‌తో స్నేహం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికి పదాలు లేవు.. అది చాలామందికి తెలియకపోవచ్చు అని తెలిపింది.

అతడిపై ప్రశంసలు కురిపించేందుకు మీడియాకు డబ్బు చెల్లించడు.. అతడు కేవలం సెల్ఫ్ మెడ్ మ్యాన్ మాత్రమే కాదు.. ప్రతి విషయంలోనూ విజయవంతమైన వ్యక్తి ఒక అద్భుతమైన మనిషి.. లవ్ యు జాన్ అంటూ తనదైన స్టైల్ లో పొగుడుతూ ఏకంగా ఆకాశానికి ఎత్తేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ మీడియా సర్కిల్స్ లో బాగా హైలైట్ అవుతోంది. గతంలో వీరిద్దరూ కలిసి ఒకటి రెండు సినిమాలలో నటించారు. ఇక గంగన ప్రస్తుతం తమిళంలో తెర‌కెక్కుతున్న చంద్రముఖి 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో కూడా ఈ నెలలోనే రిలీజ్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news