Movies"కాస్కోండి..త్వరలోనే అఖండ2 వచ్చేస్తుంది" .. క్రేజీ హింట్ ఇచ్చిన బొయపాటి శ్రీను..!!

“కాస్కోండి..త్వరలోనే అఖండ2 వచ్చేస్తుంది” .. క్రేజీ హింట్ ఇచ్చిన బొయపాటి శ్రీను..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు.. ఎంతోమంది హీరోలు ఉంటారు ..వాళ్ళ కాంబోలో వచ్చిన సినిమాలు సైతం ఉంటాయి. కానీ అందరికీ బోయపాటి శ్రీను బాలయ్య కాంబో తెరపై చూడాలి అని ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది . దానికి కారణం వాళ్లిద్దరూ కాంబో జత కడితే సిల్వర్ స్క్రీన్ బద్దలు అవ్వాల్సిందే ..బ్లాస్ట్ అయిపోయిన ఆశ్చర్యపోనవసరం లేదు . అలాంటి రికార్డులను కొల్లగొడతాయి ఈ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది .

వీళ్ళ కాంబోలో లాస్ట్ గా వచ్చిన సినిమా అఖండ. ఈ సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఫ్యాన్స్ ఈ సినిమాకి సీక్వెల్ రావాలి అని అఖండ 2 కోసం వెయిట్ చేస్తున్నామని ఎన్నో నెలలుగా చెప్పుకొస్తున్నారు . అయితే ఇదే ఇష్యూ పై స్పందించారు బోయపాటి శ్రీను. ఆయన తాజాగా నటించిన సినిమా స్కంద. సెప్టెంబర్ 15న ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే స్కంద ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ అఖండ2 పై హింట్ చేశారు.

స్టేజ్ పైకి బోయపాటి వచ్చి మాట్లాడుతుండగా అఖంద 2 అంటూ అరుస్తూ ఉండడంతో ఆయన స్పందించారు . “అఖండ 2 చేస్తాను.. కాస్త టైం ఇవ్వండి ..మీరు అనుకున్న రేంజ్ లోనే ఉంటుంది.. బొమ్మ బ్లాక్ బస్టర్ “. అనంతరం బోయపాటి మాట్లాడుతూ..” 15 ఏళ్లుగా బాలయ్యతో జర్నీ చేస్తున్నారని బాలయ్య ఓ శక్తి ఆయనకు ఒక పదమైన పాత్ర ఆయన లొంగుతుంది అందుకే జై బాలయ్య అన్నారు “. దీంతో ఆ ప్రాంగణం మొత్తం జై బాలయ్య అనే నినాదలతో దద్దరిల్లిపోయింది. మొత్తానికి బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న అఖంద 2 పై క్రేజీ హింట్ ఇచ్చేశాడు బోయపాటి. దీంతో ఫాన్స్ తెగ సంబర పడిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news