Moviesబర్త డే స్పెషల్ : ఇష్టం లేకపోయిన దాన్ని దొంగతనం చేసిన...

బర్త డే స్పెషల్ : ఇష్టం లేకపోయిన దాన్ని దొంగతనం చేసిన చిరంజీవి.. జీవితంలో అదే ఫస్ట్ అండ్ లాస్ట్..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలోకి ఎంతమంది కొత్త నటులు వస్తున్న క్రేజీ క్రేజీ రికార్డులు బద్దలు కొడుతున్న మెగాస్టార్ చిరంజీవి లెవెల్ స్టామినా ఆ రేంజ్ అక్కడే ఉంది . ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్న సరే మెగాస్టార్ చిరంజీవి అంటే జనాల్లో క్రేజ్ మాత్రం తగ్గడం లేదు . కాగ నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన పలు పాత జ్ఞాపకాలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

ఇలాంటి క్రమంలోనే ఫ్యాన్స్ కి కూడా తెలియని ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడింది . చిరంజీవి ఇండస్ట్రీలోకి ఎంత కష్టపడి వచ్చారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తినడానికి తిండి కూడా సరిగ్గా లేని పోజిషన్ నుంచి ఆయన పైకి ఎదిగారు. కాగా ఇదే టైంలో చిరంజీవి , సుధాకర్, హరిప్రసాద్ ముగ్గురు కూడా మంచి ఫ్రెండ్స్ గా మారారు. ఇక ఈ ముగ్గురు కలిసి ఒకే రూమ్ లో ఉండేవారు . అయితే ఎటువంటి రిలేషన్స్ లేకపోయినా బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయిన వీళ్ళ ముగ్గురు సినిమాలో అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరిగేవారు . డబ్బులు లేక చాలా రోజులు ఇబ్బంది పడ్డారట . ఒక పూట భోజనం చేసి పస్తులున్న రోజులు ఎన్నో ఉన్నాయి అంటూ చిరంజీవి – సుధాకర్ – హరిప్రసాద్ గతంలో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు .

అయితే ఓ రోజు బాగా ఆకలి వేయడంతో ఇంట్లో ఏమీ లేని టైంలో పక్కనే ఉన్న ఒక మునకాయ చెట్టు నుంచి మునకాయలు తెంపుకొని కూర చేసుకుని తినే టైంలో పక్కింటి వ్యక్తులు వచ్చి ఆ మునక్కాయలు మావి ..మీకు ఏం రైట్ ఉందని తెంపుకున్నారు..? అసలు ఎవరిని అడిగారు ..? అంటూ చాలా నీచంగా మాట్లాడారట. అంతేకాదు వాళ్లు వండుకున్న కూర తినే సమయానికి లాక్కుని వెళ్లిపోయారట. అయితే ఇది చూసి అక్కడే పక్కన ఉన్న వాళ్ళు చిరంజీవిని సుధాకర్ ని హరిచంద్ర ప్రసాద్ ని అవహేళన చేశారట.

దీంతో బాగా బాధపడిన చిరంజీవి ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలని కసితో ఇండస్ట్రీలో అవకాశాలు తెచ్చుకోవడానికి ట్రై చేశారు. ఆ తర్వాత చిరంజీవి సుధాకర్ ఎలాంటి స్థాయికి మారిపోయారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హరిప్రసాద్ కూడా చాలా సినిమాల్లో ముఖ్య పాత్రలో నటించారు . ఎవరైతే వారిని అవమానించారో వాళ్ళే నిజంగా మీరు గ్రేట్ అని మెచ్చుకునే స్టేజికి వెళ్లారు ఈ ముగ్గురు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news