Movies' భ‌గ‌వంత్ కేస‌రి ' ప్రి రిలీజ్ బిజినెస్‌… బాల‌య్య దెబ్బ‌తో...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌… బాల‌య్య దెబ్బ‌తో ట్రేడ్ షేకింగ్‌..!

నట‌సింహం బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా భగవంత్‌ కేసరి. వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత బాలయ్య నటిస్తున్న ఈ సినిమాపై ఇటు సినీ అభిమానులు.. నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే అఖండ – వీరసింహారెడ్డి లాంటి రెండు సూప‌ర్ హిట్ల తర్వాత బాలయ్య క్రేజ్ మామూలుగా లేదు. అసలు బాలయ్య సినిమా వస్తుందంటే చాలు బాలయ్య కెరీర్ లోనే ఎప్పుడు లేనంత హైప్‌ వస్తోంది. ఇటు బుల్లితెరపై అన్‌స్టాప‌బుల్ టాక్ షోతో బాలయ్య క్రేజ్ ఆకాశంలోనే ఉంది. ఇక భగవంత్ కేసరి సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టైటిల్, పోస్టర్, టీజర్ ఫస్ట్ లుక్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నాయి.

ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అందరూ ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలోనే అన్ని ఏరియా ల నుంచి ఫ్రీ రిలీజ్ బిజినెస్ కు భారీ డీల్స్ వస్తున్నాయి. యూఎస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ సంస్థ సరిగమ సినిమాస్ వారు భారీ రేటు చెల్లించి కొనుగోలు చేసినట్టు అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. బాలయ్య కెరీర్ లోనే ఏ సినిమాకు రానంత డీల్ ఈ సినిమాకు వచ్చినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 18 నుంచి ఈ సినిమా ప్రీమియర్స్ యూఎస్ లో పడనున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news