Moviesవీళ్లందరి విడాకుల్లో కామన్ పాయింట్ ఒక్కటే.. అదే కొంప ముంచేసిందా..?

వీళ్లందరి విడాకుల్లో కామన్ పాయింట్ ఒక్కటే.. అదే కొంప ముంచేసిందా..?

ఈ మధ్యకాలంలో పెళ్లి అనేది ఓ ఫ్యాషన్ గా మారిపోయింది . పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశామా ..? ఎంత కాస్ట్లీ చీరలు కట్టుకున్నామా..? ఎలాంటి వెడ్డింగ్ ఫోటోషూట్స్ తీసుకున్నామా..? అన్నది చూస్తున్నారే కాని.. వాళ్ళిద్దరి మధ్య నిజంగానే ప్రేమ ఉందా ..? లేదా..? అన్నది చాలా తక్కువ మంది చూస్తున్నారు .

ఈవెన్ ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలు కూడా విడాకులు తీసుకుంటూ ఉండడం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం . రీసెంట్ గా నాగబాబు కూతురు నిహారిక ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే .

కాగా 9న డిసెంబర్ 2020 లో జైపూర్ ప్యాలెస్ లో వీళ్ల వివాహం అంగరంగ వైభవంగా గ్రాండ్గా జరిగింది . స్టార్ సెలబ్రిటీ సైతం ఆశ్చర్యపోయే రేంజ్ లో డబ్బులను కుమ్మరించేసాడు నాగబాబు .

వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది . పట్టుమటూ 2 సంవత్సరాలు కూడా కాపురం చేసుకోకుండానే విడాకులు తీసుకునేశారు ఈ జంట . దీంతో సోషల్ మీడియాలో నిహారిక చైతన్య పేర్లు వైరల్ గా మారాయి .

అయితే వీళ్ళు విడాకులు తీసుకోవడానికి మెయిన్ రీజన్ వీళ్ళ మధ్య ప్రేమ లేకపోవడమే అంటూ తెలుస్తుంది . అంతేకాదు గతంలో సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ విడాకులు తీసుకున్నారు .

పవన్ కళ్యాణ్ – వేణు దేశాయ్ ..సమంత – నాగచైతన్య.. మంచు మనోజ్ – ప్రణీత రెడ్డి.. సుమంత్ – కీర్తి సురేష్.. కమల్ హాసన్ – సారిక.. నాగార్జున – లక్ష్మి ఇలా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా చాలా మంది స్టార్ సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు.

అయితే వీళ్ళందరి విడాకుల్లో కామన్ పాయింట్ ఆ దంపతుల మధ్య ప్రేమ లేకపోవడమే ..అండర్ స్టాండింగ్ లేకపోవడమే అంటూ తెలుస్తుంది . నిజంగా ఆ అందర్ స్టాండింగ్ ఉంటే..వీళ్ళు అసలు విడాకుల వరకు వెళ్లరు. దీంతో సోషల్ మీడియాలో వీళ్ల విడాకుల వార్తలు మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news