Moviesమెగా హీరోతో అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఫిక్స్.. చొక్క...

మెగా హీరోతో అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఫిక్స్.. చొక్క చించుకుని అరిచే అప్డేట్ వచ్చేస్తుందోచ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ అనిల్ రావిపూడి కి ఎలాంటి క్రేజీ ఫాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు డైరెక్టర్గా పరిచయమైన అనిల్ రావిపూడి .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ వచ్చారు . హిట్లు ప్లాపులు అంటూ తేడా లేకుండా వరుస క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి -వెంకటేష్ -వరుణ్ తేజ్ -మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసి సూపర్ డైరెక్టర్గా మారిపోయాడు.

ప్రజెంట్ అనిల్ రావిపూడి నందమూరి నట సింహం బాలయ్యతో భగవంత్ కేసరి అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా అయిపోగానే అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి- బాలకృష్ణ – నాగార్జున గార్లని దైరెక్ట్ చేయాలని ఉందని.. బాలకృష్ణ గారితో మూవీ ఫిక్స్ అయిందని ఇక నాగార్జున చిరంజీవి గారితో నా కోరిక ఎప్పుడు తీరుతుందో ..?”అంటూ కామెంట్ చేశారు .

అంతేకాదు ఆయనకు చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా అంటే చాలా ఇష్టం అని.. ఆ స్టైల్ లో ఉండే భారీ ఫాంటసీ మూవీని తెరకెక్కించాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. అయితే ఈ మాటలకు మ్యాచ్ అయ్యేటట్లు చిరంజీవి రీసెంట్ ఇంటర్వ్యూలో చరణ్ తో కలిసి జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి మూవీలో నటించాలని ఉంది అంటూ చెప్పుకు వచ్చారు. ఇలా ఇద్దరు ఒక్కే మాటలు మాట్లాడడంతో త్వరలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఇప్పుడు అనిల్ రావిపూడి స్టార్ట్ డైరెక్టర్ ..మెగాస్టార్ చిరంజీవి అవకాశం ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు . మొత్తానికి ఈ క్రేజీ అనౌన్స్మెంట్ త్వరలో రిలీజ్ అయితే బాగుంటుంది అనేది అభిమానుల అభిప్రాయం. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news