Movies"దేవర" సినిమాలో నటించడానికి జాన్వీ కపూర్ పెట్టిన ఏకైక కండీషన్ ఇదే.....

“దేవర” సినిమాలో నటించడానికి జాన్వీ కపూర్ పెట్టిన ఏకైక కండీషన్ ఇదే.. శ్రీదేవి కూతురు అనిపించిందిగా..!!

అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ మహా ముదురు పిల్ల నేనా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . కాగ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకో లేకపోయినా జాన్వి కపూర్.. కండిషన్స్ పెట్టడంలో మాత్రం నెంబర్ వన్ . ఆ విషయంలో అమ్మని మించిపోతుంది అంటున్నారు జనాలు . కేవలం బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే సినిమాకి సైతం జాన్వీ కపూర్ క్రేజీ కండిషన్స్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ .. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా ” దేవర”. ఈ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది జాన్వి కపూర్ . ఈ రోల్ కోసం ఎంతోమంది ముద్దుగుమ్మలను ట్రై చేసిన కొరటాల లాస్ట్ కి జాన్వి కపూర్ నే సెలెక్ట్ చేశారు. అయితే ఈ సినిమా స్టోరీ చెప్పగానే జాన్వి కపూర్ చాలా ఇంప్రెస్ అయిందట. కానీ కొరటాల శివకు కండిషన్ పెట్టిందట .

కొరటాల రాసుకున్న పాత్ర ప్రకారం ఈ సినిమాలో జాన్వి కపూర్ చనిపోతుంది . అయితే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే ఫస్ట్ సినిమాతోనే ఇలా చనిపోయే రోల్ లో కనిపిస్తే సెంటిమెంట్ గా భావించి జాన్వి కపూర్ “నా పాత్ర చనిపోకుండా ఉండేలా కథను మలచమన్నిందట. అప్పుడే సినిమాకు నేను సైన్ చేస్తాను” అంటూ కండిషన్ పెట్టిందట .

అయితే జాన్వి చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది అన్న కారణంగా కొరటాల స్క్రిప్ట్ మార్చి ఆమె పాత్రను బ్రతికించాడట. అయితే గతంలో శ్రీదేవి చాలా సినిమాల్లో ఇలాంటి కండిషన్స్ పెట్టిందట . తన పాత్రను చనిపోకుండా ఉండాలి అని … డైరెక్టర్ లకు రిక్వెస్ట్ చేసిందట. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ శ్రీదేవి ఇద్దరు ఒకటే అంటూ ఆ విషయంలో శ్రీదేవి కూతురు తల్లిని ఫాలో అవుతుంది అంటూ ట్రెండ్ చేస్తున్నారు ఆమె అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news