Moviesబిగ్ షాకింగ్: మెగా ఫ్యామిలీలో విషాదం..ఎమోషనల్ పోస్ట్ చేసిన సాయి ధరమ్...

బిగ్ షాకింగ్: మెగా ఫ్యామిలీలో విషాదం..ఎమోషనల్ పోస్ట్ చేసిన సాయి ధరమ్ తేజ్..!!

ఈ మధ్యకాలంలో మూగజీవులను ప్రేమించే జనాలు ఎక్కువగా కనిపిస్తున్నారు . కేవలం సామాన్య జనాలే కాదు ..డబ్బు – హోదా – పరువు – ప్రతిష్ట ఉన్న స్టార్ హీరోలు= హీరోయిన్ సైతం మూగజీవులను పెంచుతూ తమ ప్రేమను చూపిస్తున్నారు . కాగా కొందరు కుక్క పిల్లలని ఎంతో ఇష్టంగా ప్రేమగా పెంచుకుంటూ సొంత బిడ్డలా జాగ్రత్తలు తీసుకుంటూ కేర్ తీసుకుంటూ వస్తున్నారు . అయితే ఇప్పటివరకు మనం ఎక్కువగా ఇండస్ట్రీలో కుక్కలను- కుక్కపిల్లలను పెంచుకునే హీరోయిన్స్ చూసుంటాం. హీరోలు చాలా రేర్. మన ఇండస్ట్రీలో అలాంటి హీరోలు చాలా తక్కువ . వాళ్ళల్లో ఒకరి సాయిధరమ్ తేజ్.

సాయి ధరంతేజ్ కి మొదటి నుంచి మూగజీవులు అంటే చాలా ఇష్టం. ఎప్పటినుంచో కుక్కని పెంచుకుంటూ వస్తున్నారు. తేజ్ తన కుక్కకు ట్యాంగో అనే పేరును కూడా పెట్టారు. అడపాదడప తన సోషల్ మీడియా ఖాతాలో ఆ టాంగో తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ వచ్చి అభిమానులకు ఎంటర్టైన్ చేసేవారు . కాగ రీసెంట్గా మెగా ఫ్యామిలీలో విషాదం చోటుచేసుకుంది. తన కుక్క ట్యాంగో చనిపోవడంతో కుక్కతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు సాయి ధరంతేజ్ .

తన కుక్క చిన్నగా ఉన్నప్పుడు నుంచి తన దగ్గర ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు . “ఈ లెటర్ లో నిన్ను తలుచుకున్నప్పుడు నా మనసు చాలా ఆనందంగా ఉంటుంది . నువ్వు లేకపోతే చాలా కష్టంగా ఉంది. నువ్వు నన్ను రక్షించావు- నవ్వించావు – నా కష్టాల్లోనూ – నా సంతోషాల్లోనూ – నాకు ఎప్పుడు తోడుగా నిలిచావు . ఎన్నో విషయాలను నీతో షేర్ చేసుకున్నాను . నాకు ఎంతో ప్రేమను ఇచ్చిన నువ్వు ఇప్పుడు నా జీవితంలో లేకపోవడం బాధగా అనిపిస్తుంది. నువ్వు నా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఎప్పుడు స్పెషల్ గానే ఉండింది లవ్ యు మై బండ ఫెలో ట్యాంగో” అంటూ చాలా ఎమోషనల్ గా రాసుకోచ్చాడు. దీనిపై అభిమానులు నెటిజన్స్ కూడా బాధగా కామెంట్స్ చేస్తున్నారు ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news