Moviesబ్రేకింగ్: "ఆదిపురుష్" సినిమా చూసేందుకు నిజంగానే వచ్చిన హనుమాన్.. వీడియో వైరల్..!!

బ్రేకింగ్: “ఆదిపురుష్” సినిమా చూసేందుకు నిజంగానే వచ్చిన హనుమాన్.. వీడియో వైరల్..!!

టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా “ఆది పురుష్”. కాగా బాహుబలి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత హిట్లు లేక అల్లాడిపోతున్న ప్రభాస్ తన ఆశలన్నీ ఈ సినిమా పైన పెట్టుకొని ఉన్నాడు . బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెకిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ ని సంపాదించుకునింది . ఆఫ్ కోర్స్ రామాయణం కథ మొత్తం మనకు తెలిసిందే .

ఇప్పటికే ఎన్నో సినిమాలు ఈ కాన్సెప్ట్ తో వచ్చే సక్సెస్ అయ్యాయి. అయితే ఇదివరకు ఎవరు చేయని సాహసాన్ని చేస్తూ డైరెక్టర్ కథను నేటి కాలం జనాలకి నేటి కాలం యువతకి అర్థమయ్యే విధంగా తెరకెక్కించడం సినిమాకే ప్లస్ గా మారింది . కాగ మొదటి నుంచి వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ నాసిరకంగా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చిన ఫైనల్లీ అదే ప్రూవ్ చేసుకున్నాడు డైరెక్టర్. ఈ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది అజయ్ అతుల్ మ్యూజిక్ . తెరపై రాముడు గెటప్ లో ప్రభాస్ ని చూస్తున్నప్పుడు వెనక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే ప్రతి ఒక్క మనిషికి గూస్ బంప్స్ రావాల్సిందే.

అంతటి పవర్ ఫుల్ గా ఉన్నాయి మ్యూజిక్ బీజిఎం. కాగా ఈ సినిమాని ఆడుతున్న థియేటర్లలో ప్రతి షోకి ఒక సీట్ హనుమంతునికి కేటాయించాలి అని ..డైరెక్టర్ ఓం రావత్ నిర్మాతలను కోరిన విషయం తెలిసిందే. రామాయణం పారాయణం చేసే చోట ప్రతిసారి హనుమాన్ అక్కడికి వస్తారు అని వాళ్ళ అమ్మగారు చెప్పారు అంట . ఈ క్రమంలోని ఆది పురుష్ సినిమా కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఓం రావత్ . అయితే నిజంగానే ఓం రావత్ చెప్పినట్లే జరిగింది.

ఆది పురుష్ సినిమాను చూడడానికి హనుమాన్ వచ్చేసాడు . దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆది పురుష్ సినిమా ప్రదర్శితమవుతున్న ఒక థియేటర్లో కోతి ప్రత్యక్షమైంది. థియేటర్ విండోలో నుంచి వచ్చిన కోతి ఆదిపురుష్ సినిమా ని కన్ను ఆర్పకుండా చూస్తోంది . ఇదే మూమెంట్స్ ని వీడియో తీశాడు ఓ అభిమాని దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు . ఇది కాస్త నెట్టింట వైరల్ అవ్వగా.. ఆది పురుష మూవీ టీం కూడా వీడియోని రీట్వీట్ చేసింది . ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news