Newsఆదిపురుష్ : సినిమా హాల్లో హనుమంతుడి సీటు ఎలా ఉందో చూశారా..?...

ఆదిపురుష్ : సినిమా హాల్లో హనుమంతుడి సీటు ఎలా ఉందో చూశారా..? మోస్ట్ స్పెషల్ ధింగ్ ఏంటంటే..?

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాకి సంబంధించిన టాక్ వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ.. బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ .. సోషల్ మీడియా ..వెబ్ మీడియా ఎక్కడ చూసినా సరే ప్రభాస్ నటించిన ఆది ఫురుష్ సినిమా రివ్యూ లు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . కాగా పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన ఆది పురుష్ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది . ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన ప్లస్ పాయింట్స్ ను మైనస్ పాయింట్స్ ట్విట్టర్ ద్వారా ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు అభిమానులు. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్స్ ప్రకారం .. సినిమా సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

కాగా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ ఓం రావత్ ఇప్పటివరకు ఏ సినిమా డైరెక్టర్ తీసుకొని సెన్సేషనల్ డెసీషన్ తీసుకున్నారు. ఆది పురుష్ సినిమా ఏ థియేటర్లో అయితే ఆడుతుందో ..ఆ సినిమా హాల్లో ప్రతి షోకి ఒక సీట్ హనుమంతునికి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు . వాళ్ళ అమ్మగారు కోరిక అది అంటూ చెప్పుకొచ్చారు. మనం హనుమంతుని తలుచుకునేటప్పుడు ఆయన కచ్చితంగా అక్కడ ఉండి సినిమాను చూస్తారని ..ఆయన కోసం ఒక సీట్ కచ్చితంగా కేటాయించాలని మేకర్స్ స్పెషల్గా రిక్వెస్ట్ చేశారు. నిర్మాతలు సైతం ఓంరావత్ డెసిషన్ కి అంగీకారం తెలిపారు . ఈ క్రమంలోనే ఈ సినిమాకి ఇదే ఎక్కువ ప్లస్ పాయింట్ అయింది.

కాకపోతే రీసెంట్గా సినిమా హాల్లో హనుమంతుని సీట్ ఏ విధంగా డిజైన్ చేశారో పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా కాషాయ వస్తం వసి.. హనుమంతుని ఫోటో పెట్టి జైశ్రీరామ్ అంటూ పూలమాలలు ..పసుపు కుంకుమ ..టెంకాయ కొట్టిన ఫొటోస్ వైరల్ గా మారాయి . అంతేకాదు హనుమంతుని సీటు పక్కనున్న సీటుకి ఎక్కువ టికెట్ కాస్ట్ పెడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగక .. ఆ వార్తలను కొట్టి పడేసింది సినిమా బృందం. అలాంటిది ఏదీ లేదని నార్మల్ సీట్స్ ఏ టికెట్ రేట్ ఉంటుందో అదే రేటు ఉంటుందని దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు అంటూ చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే హనుమంతుని సీట్ పక్కన కూర్చొని సినిమా చూడాలని చాలామంది జనాలు ఆశపడుతున్నారు. అంతేకాదు ఆ సీట్ నెంబర్ కోసం ముందు నుంచే టికెట్స్ బుక్ చేసుకోవడానికి తెగ ట్రై చేస్తున్నారట . అన్నిటికన్నా మోస్ట్ స్పెషల్ థింగ్ ఏందంటే ఇప్పటివరకు ఏ సినిమా చరిత్రలోనే ఏ డైరెక్టర్ ఇలా హనుమంతుని కోసం సీటు కేటాయించలేదు . ఫస్ట్ టైం అలాంటి సాహసం చేసి ఆదిపురుష్ సెన్సేషనల్ రికార్డు నెలకొల్పింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news