Moviesఎవ‌డో కోన్‌కిస్కా గొట్టం గాడిని ప‌ట్టించుకోను... నిహారిక ఇంత రెచ్చిపోయిందేంటి...!

ఎవ‌డో కోన్‌కిస్కా గొట్టం గాడిని ప‌ట్టించుకోను… నిహారిక ఇంత రెచ్చిపోయిందేంటి…!

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక ఇటీవ‌ల బాగా వార్త‌ల్లో ఉంటోంది. ఇటు తెలుగు మీడియాతో పాటు సోష‌ల్ మీడియాలో నిహారిక పేరు మార్మోగుతోంది. ఆమె గ‌త కొద్ది రోజులుగా త‌న భ‌ర్త జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌కు దూరంగా ఉంటోంది. వీరిద్ద‌రి మ‌ధ్య తీవ్ర‌మైన స్ప‌ర్థ‌లు వ‌చ్చేశాయ‌ని.. త్వ‌ర‌లోనే విడిపోతున్నారంటూ ఒక్క‌టే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారానికి త‌గిన‌ట్టుగానే వీరిద్ద‌రు వేర్వేరుగా ఉంటున్నారు.

ఒక‌రి సోష‌ల్ మీడియాను మరొక‌రు అన్‌ఫాలో చేసుకోవ‌డంతో పాటు ఎవ‌రి దారుల్లో వారు ఉంటున్నారు. ఇక భ‌ర్త‌కు దూరంగా ఉంటోన్న నిహారిక సినిమా ప్రొడ‌క్ష‌న్‌తో పాటు తాను కూడా వెబ్‌సీరిస్‌ల్లో న‌టిస్తూ బిజీగా ఉంటోంది. తాజాగా ఆమె న‌టించిన డెడ్ పికెల్స్ వెబ్‌సీరిస్ ఈ నెల 19న స్ట్రీమింగ్‌కు వ‌స్తోంది. డిస్నీ + హాట్‌స్టార్‌లో ఈ సీరిస్ స్ట్రీమింగ్ కానుంది.

ఈ సీరిస్ ప్ర‌మోష‌న్ల‌లో నిహారిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ప‌ని పాట లేని వాళ్లే త‌న‌ను ట్రోల్ చేస్తూ ఉంటార‌ని… అలాంటి వాళ్ల‌ను తాను ప‌ట్టించుకోన‌ని చెప్పింది. మ‌నం అవ‌స‌రం లేని వాళ్ల‌కు అటెన్ష‌న్ ఇస్తూ ఉంటాం.. ప్ర‌తి చోటా ఇడియ‌ట్స్ ఉంటూ ఉంటారు.. వాళ్ల‌ను ప‌ట్టించుకుంటే నా వెద‌వ‌త‌నం వ‌ల్ల ఇంత అటెన్ష‌న్ ఇస్తుంటాం అని ఇంకా రెచ్చిపోతామ‌ని చెప్పింది.

ఎవ‌డో కూన్ కిస్కా గొట్టంగాడి గురించి నేను ఎందుకు ప‌ట్టించుకుంటాన‌ని.. ఒక‌ప్పుడు నా పై సోష‌ల్ మీడియాలో వ‌చ్చే కామెంట్ల గురించి ప‌ట్టించుకునే వాడిని అని.. అయితే ఇప్పుడు వాటి గురించి ఆలోచించ‌డం.. వాటిని చూడ‌డ‌మే మానేశాన‌ని నిహారిక చెప్పింది. ఎవ‌డో ఏదో కామెంట్ చేస్తే నేను ఎందుకు ప‌ట్టించుకోవాలి.. దానివ‌ల్ల మ‌న ఆరోగ్యం పాడ‌వుతుంద‌ని.. అందువల్ల సోష‌ల్ మీడియా కామెంట్స్ తాను ప‌ట్టించుకోవ‌డం మానేశాన‌ని నిహారిక స్ట్రాంగ్‌గా త‌న అభిప్రాయం చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news