Newsబిగ్ బ్రేకింగ్: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..స్టార్ కమెడియన్ మృతి..!

బిగ్ బ్రేకింగ్: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..స్టార్ కమెడియన్ మృతి..!

ఇటీవల సినిమా పరిశ్రమలో వరుస‌గా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినిమా పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు సీనియర్ హీరోలు.. హీరోయిన్లు సినిమా రంగానికి చెందిన వారు వరుసగా మృతి చెందుతున్నారు. ఈ క్రమంలోనే సినిమా రంగంలో ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కమెడియన్ మనోభాల ( 69) మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విష‌మించడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు.

మనోబాల మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇక మనోబాల తమిళంతో పాటు తెలుగు సినిమాల్లో నటించారు. తనదైన మార్కు కామెడీ టైమింగ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఆయ‌న డైరెక్ట‌ర్ కూడా. కొన్ని సినిమాల‌ను డైరెక్ట్ చేశారు.

తెలుగులోనూ ఆయ‌న క‌థా నాయ‌కుడు, పున్న‌మినాగు, మ‌హాన‌టి, దేవ‌దాసు, రాజ్‌దూత్‌, వాల్తేరు వీర‌య్య లాంటి సినిమాల్లో న‌టించారు. 35 ఏళ్ల కెరీర్‌లో 450కు పైగా సినిమాల్లో న‌టించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మనోబాల ఆరోగ్యం సహకరించకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యంతో ఈరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news