Newsఅఖిల్ ఏంటి ఇంత స్పీడ్‌… కొత్త సినిమా టైటిల్ కూడా వ‌చ్చేసింది..!

అఖిల్ ఏంటి ఇంత స్పీడ్‌… కొత్త సినిమా టైటిల్ కూడా వ‌చ్చేసింది..!

అక్కినేని నాగార్జున వారసుడుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్. అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎనిమిది ఏళ్లు దాటుతోంది. కెరీర్లో సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తున్న ప్రతిసారి అఖిల్‌కు తీవ్రమైన నిరాశ మిగులుతుంది. భారీ అంచనాలతో వచ్చిన తొలి సినిమా అఖిల్ పెద్ద డిజాస్టర్. వివి. వినాయ‌క్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ డైరెక్ట్ చేసినా కూడా అఖిల్ పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది.

ఆ తర్వాత హలో – మిస్టర్ మజ్ను సినిమాలు కూడా ప్లాప్‌. ఇక తాజాగా ఏజెంట్ లాంటి భారీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ పరాజయం మూట కట్టుకున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలనుకున్నాడు అఖిల్. అయితే అఖిల్ కెరీర్ లోనే ఏజెంట్ భారీ డిజాస్టర్ మూవీగా నిలిచింది. అఖిల్ తో పాటు నాగార్జున పరువు మొత్తం తీసేసింది. అసలు అఖిల్‌కు కెరీర్లో ఎప్పటికీ సరైన బ్లాక్ బస్టర్ హిట్టు దక్కుతుందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు.

ఏజెంట్ సినిమా పరాజయం నుంచి కోలుకునేందుకు విదేశీ టూర్లకు వెళ్లిన అఖిల్ వెంటనే తన కొత్త చిత్రంపై ఫోకస్ పెట్టాడు. ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అనిల్ కుమార్ ఇటువంటి అఖిల్‌కు ఓ కథ వినిపించారట. ఆ కథ అఖిల్‌కు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడని ఫ్యాంట‌సీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తోంది.

యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనుంది. విచిత్రం ఏంటంటే ఈ సినిమా టైటిల్ కూడా అప్పుడే ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. వీర అనే టైటిల్ అఖిల్ కొత్త సినిమాకు పరిశీలనలో ఉన్నట్టు ఫిలింనగర్ లో ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మరి ఈ సినిమాతోనే అయినా అఖిల్ కెరీర్లో సాలిడ్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news