Moviesజాన్వీకి అప్పుడే దండం పెట్టేస్తోన్న టాలీవుడ్‌… వామ్మో ఇంత దారుణమైన బిహేవియ‌రా…?

జాన్వీకి అప్పుడే దండం పెట్టేస్తోన్న టాలీవుడ్‌… వామ్మో ఇంత దారుణమైన బిహేవియ‌రా…?

దివంగ‌త అతిలోక అందాల సుంద‌రి శ్రీదేవి కుమార్తె జాన్వీక‌పూర్ ఊరిస్తూ ఊరిస్తూ ఎట్ట‌కేల‌కు ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ – కొర‌టాల కాంబోలో వ‌స్తోన్న సినిమాతో ఆమె సౌత్ సినీ ఎంట్రీ ఇస్తోంది. జాన్వీ కపూర్ న‌టిస్తోన్న ఓ షెడ్యూల్ షూటింగ్‌ ప్రస్తుతం నడుస్తోంది. అయితే తొలి సినిమాతోనే ఆమె దారుణ‌మైన బిహేవియ‌ర్ గురించి ఇప్పుడు టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో పెద్ద చ‌ర్చ‌లే న‌డుస్తున్నాయి.

ఈ సినిమా కోసం జాన్వీకి రు. 4 కోట్లు ఇస్తామ‌ని మేక‌ర్స్ అడిగార‌ట‌. అయితే అందుకు ఆమె స‌సేమీరా అన్న‌ట్టు తెలిసింది. రు. 5 కోట్ల‌కు త‌క్కువ అయితే తాను డేట్లు ఇవ్వ‌లేన‌ని చెప్పడంతో చివ‌ర‌కు నిర్మాతలు ఆమె అడిగినంత స‌మ‌ర్పించుకుంటున్నారు. దీనికి తోడు ఇద్ద‌రు అసిస్టెంట్ల‌తో పాటు వారి సౌక‌ర్యాల భారం కూడా నిర్మాత‌ల మీదే ప‌డుతోంది.

అంటే ఈ లెక్క‌న ఆమెకు ముట్టే రెమ్యున‌రేష‌న్ అన్నీ క‌లుపుకుంటే రు. 6 కోట్లు దాటిపోతోంది. సాహో సినిమాకు శ్ర‌ద్ధాక‌పూర్ రు. 5 కోట్లు తీసుకుంది. ఇక కియారా అద్వానీ కూడా రామ్‌చ‌ర‌ణ్ గేమ్‌ఛేంజ‌ర్‌కు అంతే తీసుకుంటోంద‌ట‌. అయితే తొలి సినిమాకే జాన్వీ రు. 5 కోట్లు డిమాండ్ చేస్తుండ‌డంతో పాటు త‌న అసిస్టెంట్ల ఖ‌ర్చంతా భ‌రించాల‌న్న డిమాండ్ల‌తో టాలీవుడ్ షాక్ అవుతోంది.

తొలి సినిమాతోనే జాన్వీ ఇన్ని గొంతెమ్మ కోర్కెలు కోరితే ఎలా ? అని ముక్కున వేలేసుసుకుంటున్నారు.
అస‌లు బాలీవుడ్ లో ఆమెకు పాపులారిటీ అంతంతమాత్రం. ఇప్పటివరకు సాలిడ్ హిట్ లేద‌నే చెప్పాలి. ఓ వైపు అక్క‌డ పెద్ద హీరోలు ఆమెకు అవకాశం ఇవ్వడం లేదు. మ‌రి టాలీవుడ్‌లో ముందే భారీ రెమ్యున‌రేష‌న్లు అడుగుతోంది. ఇలా అయితే ఇక్క‌డ జాన్వీకి కెరీర్ క‌ష్ట‌మే అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news