Movies' ఏజెంట్ ' ప్రి రిలీజ్ బిజినెస్‌… అఖిల్ నెత్తిమీద పెద్ద...

‘ ఏజెంట్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌… అఖిల్ నెత్తిమీద పెద్ద టార్గెట్‌.. తేడా వ‌స్తే బొక్క బోర్లాయే..!


అక్కినేని అఖిల్ హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమా ఏజెంట్‌. గ‌త రెండున్న‌ర సంవ‌త్స‌రాలుగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా ఎట్ట‌కేల‌కు ఎన్నో అవాంత‌రాలు దాటుకుని ఈ నెల 28న థియేట‌ర్ల‌లోకి దిగుతోంది. పాన్ ఇండియా లెవ‌ల్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్‌

అఖిల్‌తో పాటు ప్ర‌ముఖ మళ‌యాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. ఏరియాల వారీగా చూస్తే ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోతోంది. ఏజెంట్ నైజాం హక్కులను 10 కోట్లకు అమ్మారు. సీడెడ్ లో రూ.4.50 కోట్లు – ఆంధ్రాలో రూ.14.80 కోట్లుకు అమ్మారు.

ఇక ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా మొత్తం రూ.29.30 కోట్ల ప్రి రిలీజ్‌ బిజినెస్ జరిగింది. ఇక క‌ర్నాట‌క‌, రెస్టాఫ్ ఇండియా క‌లిపి రు 3.80 కోట్లు – ఓవర్సీస్ లో రూ.3.10 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ.36.20 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ఏజెంట్ బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే అఖిల్ రు. 37 కోట్ల షేర్ కొల్ల‌గొట్టాలి. తేడా వ‌స్తే మొత్తం అంద‌రూ నిండా మునిగిపోవ‌డం ఖాయం.

అఖిల్ తొలి సినిమా అఖిల్‌కు రు. 55 కోట్ల బిజినెస్ జ‌రిగింది. తొలి రోజే ప్లాప్ టాక్‌తో రు. 10 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. ఆ త‌ర్వాత అఖిల్ ఏ సినిమాకు అంత బిజినెస్ జ‌ర‌గ‌లేదు. మ‌రి ఇప్పుడు అఖిల్ ఫామ్‌ను బ‌ట్టి చూస్తే ఈ రు. 37 కోట్ల టార్గెట్ పెద్ద‌దే. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు వ‌క్కంతం వంశీ స్టోరీ అందించ‌గా అనిల్ సుంకర నిర్మించారు. రాగూల్ హెరియన్ థారుమాన్ సినిమాటోగ్రఫీ చేస్తుండగా… నవీన్ నూలీ ఎడిటర్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news