Moviesరామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ లుక్ రిలీజ్.. గ్లోబల్ స్టార్...

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ లుక్ రిలీజ్.. గ్లోబల్ స్టార్ కి ఆ ఒక్కటే తక్కువైందా..? ఉన్న పరువు పోయిందా..?

ప్రజెంట్ సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నేడు మెగా పవర్ స్టార్ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంచరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తర్వాత నటిస్తున్న సినిమా ఆర్సి15కి సంబంధించిన డీటెయిల్స్ ను చిత్ర బృందం ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తుంది.

ఉదయాన్నే చిత్ర టైటిల్ రిలీజ్ చేసిన ఈ సినిమాకి గేమ్ ఛేంజర్ అనే పేరుని కన్ఫామ్ చేశారు . అంతేకాదు ఈ టైటిల్ లోగో ని కూడా విడుదల చేశారు. కాగా టైటిల్ తో మెగా అభిమానులను నిరాశపరిచిన శంకర్ కనీసం ఫస్ట్ లుక్ తోనైనా అభిమానుల్ని ఆకట్టుకుంటాడు అని ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేసారు మెగా అభిమానులు . కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ మెగా అభిమానులకు బిగ్ రాడ్ దించేసింది.

ఆర్ ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత రామ్ చరణ్ ని ఎలా చూడాలనుకున్నారో మెగా ఫాన్స్ దానికి పూర్తి భిన్నంగా చూపించాడు శంకర్ . ఈ క్రమంలోనే మెగా ఫాన్స్ తీవ్రంగా హర్ట్ అవుతున్నారు , చాలా స్టైలిష్ గా కనిపిస్తున్న ఫేస్ లో మాత్రం ఆ గ్లో ఎక్కడ కనిపించలేదు , అంతేకాదు చెర్రీ హెయిర్ స్టైల్ ఒక్కటే ఈ పోస్టర్ కి ప్లస్ గా మారింది, మిగతాది అంత మైనస్. చరణ్ కి గడ్డం సినిమాకి నెగిటివ్గా మారిపోతుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

మరీ ముఖ్యంగా ఇదంతా ఓ మాస్ అవతార్ లా ఉంది గాని ఎక్కడ సినిమా టైటిల్ కి సినిమా లుక్స్ కి పొంతనే లేదు అంటూ మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. బైక్ పై కూర్చొని చెర్రీ ఇచ్చిన ఫోజ్ ఉన్న పోస్టర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే భారీ అంచనాలు పెట్టుకుని ఉన్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని ఇప్పటినుంచే మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడిపోతున్నారు. దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే డిజాస్టర్ గా మార్చేశారు శంకర్ అంటూ జనాలు ఫైర్ అవుతున్నారు..దీంతో శంకర్ కి ఉన్న పరువు కూడా పోయిన్నత్లైంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news