MoviesSamantha శివరాత్రి స్పెషల్: భగవంతుని ఆశీస్సులతో..ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన...

Samantha శివరాత్రి స్పెషల్: భగవంతుని ఆశీస్సులతో..ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన సమంత..!!

“నేడు మహాశివరాత్రి “.. దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు శివ భక్తులు . ఈ క్రమంలోని స్టార్ సెలబ్రెటీస్ సైతం మహాశివరాత్రి పండుగను సెలబ్రేట్ చేసుకున్న ఫిక్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేస్తూ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత కూడా అభిమానులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసింది.

శాకుంతలం సినిమాలోని ఓ పిక్ ని పోస్ట్ చేస్తూ సమంత తన అభిమానులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసింది . రీసెంట్ గానే ఆమె తమిళనాడులోని పళని మురుగన్ స్వామి దేవాలయాన్ని సందర్శించి .. కర్పూరం వెలిగించుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగి తేలిపోయిన సమంత .. తన ఆరోగ్యం కుదుటపడడంతో మళ్లీ సినిమా షూటింగ్లో బిజీగా మారింది . ఈ క్రమంలోనే ఇప్పటికే బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సిటాడిల్ , శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఖుషి సినిమా షూటింగ్స్ లో పాల్గొనబోతుంది.

కాగా రీసెంట్గా సమంత మహాశివరాత్రి సందర్భంగా అభిమానులకు విషెస్ తెలియజేస్తూ ఆ శివుడి ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలి అంటూ.. ‘ఓం నమః శివాయ!, అంటూ రాసుకొచ్చింది. దీంతో సమంత మళ్ళీ ఇదివరకటి సమంతలా మారిపోయిందని …మయోసైటీస్ నుంచి పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుందని తెలుస్తుంది . ఏది ఏమైనా సరే మహాశివరాత్రి సందర్భంగా సమంత పెట్టిన పోస్ట్ క్షణాల్లోని వైరల్ గా మారడం అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news