Moviesఇది నిజంగా ఓ అదృష్టమే..‘శంకరాభరణం’ రిలీజ్ అయిన రోజే మరణించిన కే....

ఇది నిజంగా ఓ అదృష్టమే..‘శంకరాభరణం’ రిలీజ్ అయిన రోజే మరణించిన కే. విశ్వనాథ్..!!

సినిమా ఇండస్ట్రీకి నిజంగా ఇది దురదృష్టకరమైన వార్త అనే చెప్పాలి . కేవలం సినిమా ఇండస్ట్రీకే కాదు సినీ జనాలకు సినీ లవర్స్ కు ఇది నిజంగా మరిచిపోలేని బ్యాడ్ న్యూస్ అని చెప్తున్నారు . టాలీవుడ్ స్టార్ లెజెండ్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న కళాతపస్వికే విశ్వనాథ్ కొన్ని గంటల క్రితమే మృతి చెందారు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కే విశ్వనాథ్ ..గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు . ఈ క్రమంలోని చికిత్స తీసుకున్న ఆయన బాడీ ఆ చిక్త్స్ కు స్పందించకపోవడంతో గురువారం రాత్రి ఆయన తుది శ్వాస వచ్చారు .

ఇది నిజంగా ఇండియన్ చిత్ర పరిశ్రమకే తీరని లోటు అంటూ ప్రముఖులు ఆయన మరణానికి సంతాపం ప్రకటిస్తున్నారు . అయితే దర్శకుడిగా మారడం ఆయన జీవితంలో ఎంత విచిత్రంగా జరిగిందో అందరికీ తెలిసిందే . అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సాహంతో దర్శకుడుగా మారాను అంటూ పలు ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చాడు కె.విశ్వనాథ్ . కాగా కె విశ్వనాథ్ కెరియర్ లో మర్చిపోలేని సినిమా ఏది అంటే కచ్చితంగా అందరూ చెప్పేది శంకరాభరణం సినిమా . ఈ సినిమా ఎన్ని రికార్డులను కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఆ సినిమానే ఆయన పేరుని దాదాపు 5 దశాబ్దాల పాటు దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీలో మారు మ్రోగిపోయేలా చేసింది. కాగా అలాంటి సినిమాలు ఆయన లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . కాగా మరణం లోను ఆయన శంకరాభరణం సినిమాను వీడలేదు . సరిగ్గా 43ఏళ్ల క్రితం అంటే 1980 ఫిబ్రవరి 2న శంకరాభరణం సినిమా విడుదలైంది . ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు అదే రోజున కే విశ్వనాథ్ కన్నుమూశారు . తన కెరీర్ని అద్భుతమైన స్టేజికి తీసుకెళ్లి సినిమా విడుదలైన రోజే కళాతపస్వి మరణించడం ఇది నిజంగా అద్భుతమైన విషయమనే చెప్పాలి . ఇలా తన మరణం లోను తన ఇష్టమైన సినిమా శంకరాభరణం వీడలేదు కళాతపస్వి అంటూ ఫాన్స్ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news